Share News

స్పెషల్‌ యాక్షన్‌ టీంల ఫుట్‌ మార్చ్‌

ABN , First Publish Date - 2023-11-20T23:45:42+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకునే ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కరీంనగర్‌లోని పలు వీధుల్లో సోమవారం రాత్రి పోలీసులు, స్పెషల్‌ యాక్షన్‌ టీంలు ఫుట్‌ మార్చ్‌ నిర్వహించాయి.

స్పెషల్‌ యాక్షన్‌ టీంల ఫుట్‌ మార్చ్‌
ఫుట్‌మార్చ్‌ చేస్తున్న పోలీసులు, స్పెషల్‌ యాక్షన్‌ టీంలు

కరీంనగర్‌ క్రైం, నవంబరు 20: అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకునే ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కరీంనగర్‌లోని పలు వీధుల్లో సోమవారం రాత్రి పోలీసులు, స్పెషల్‌ యాక్షన్‌ టీంలు ఫుట్‌ మార్చ్‌ నిర్వహించాయి. పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనదారులకు డ్రంకెన్‌డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అభిషేక్‌ మొహంతి మాట్ల్లాడుతూ గతంలో ఎన్నికల సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామన్నారు. నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకతతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ముగిసేలా చూడడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో కరీంనగర్‌ టౌన్‌ ఏసీపీ నరేందర్‌, సీఐలు రవీందర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T23:45:46+05:30 IST