నాబార్డు పథకాలతో ఆర్థిక చేయూత
ABN , First Publish Date - 2023-02-04T23:35:20+05:30 IST
నాబార్డు పథకాలతో ఆర్థిక చేయూత చేకూరుతుందని గ్రామీణ నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ చింతల సుశీల అన్నారు.
కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 4: నాబార్డు పథకాలతో ఆర్థిక చేయూత చేకూరుతుందని గ్రామీణ నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ చింతల సుశీల అన్నారు. శనివారం కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో చింతకుంట సహకార సంఘంలో గ్రామీణ మార్కెట్‌ను నాఫ్‌కాబ్, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ముంబాయిలోని ప్రధాన కార్యాలయంలో నాబార్డు స్కీం రూపకల్పన చేసేవారమన్నారు. మొదట్లో ఈ స్కీం ఏడు లక్షలుగా ఉండేదన్నారు. ఏడు లక్షల రూపాయలు సరిపోవని స్కీం విలువను 15లక్షలకు పెంచామన్నారు. పెంచిన స్కీంతో చింతకుంటలో మార్కెట్ యార్డుల నిర్మాణం చేపట్టడం ఆనందదాయకంగా ఉందన్నారు. స్కీంల రూపకల్పన చేసి, నేడు అవే స్కీంలతో నిర్మించిన కట్టడాలను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చింతకుంట సహకార సంఘం అన్ని విధాలా ఆర్థిక స్వావలంభన సాధించాలన్నారు. కొండూరి రవీందర్‌రావు మాట్లాడుతూ సభ్యులంతా సంఘటితంగా ఉంటే సహకార రంగాన్ని అభివృద్ధి చేయవచ్చని చింతకుంట సహకార సంఘం సభ్యులు నిరూపించాన్నారు. చింతకుంట సహకార సంఘానికి తనవంతుగా సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు న్యాలమడుగు శంకరయ్య, తుమ్మల రమేష్‌రెడ్డి, నాబార్డు సభ్యులు శ్రీరామ్, అనంత్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, ఉపాధ్యక్షుడు అంజనీకుమార్, సురేందర్‌రెడ్డి, సంఘం సభ్యులు తిరుపతి, వీరేశం, రైతు సంఘం ఉపాధ్యక్షుడు రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, కరుణ, జమున, సునంద, తదితరులు పాల్గొన్నారు.