బీసీ కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సహాయం

ABN , First Publish Date - 2023-06-08T00:24:06+05:30 IST

బీసీ కుల, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈనెల 9న సంక్షేమ సంబురాల సందర్భంగా లాంఛనంగా ప్రారంభించాల ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

బీసీ కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సహాయం

పెద్దపల్లి, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): బీసీ కుల, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈనెల 9న సంక్షేమ సంబురాల సందర్భంగా లాంఛనంగా ప్రారంభించాల ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, శాఖాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సంగారెడ్డి నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ప్రభుత్వం బీసీ కుల, చేతి వృత్తుల వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించ టానికి జూన్‌ 9న సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభిస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లబ్ధ్దిదారులకు సహా యం అందించాలన్నారు. ఏరోజుకు ఆరోజు ఆన్‌లైన్‌లో సాయంత్రం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచా రణ చేపట్టి లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నారు. జూన్‌ 9న ప్రారం భిస్తున్నామని, జూన్‌ 20వరకు దరఖాస్తులు స్వీకరించి న తరువాత విచారణ చేపట్టి ప్రతి నెలా దశల వారీగా లబ్ధిదారులకు ఆర్థికసహాయం అందిస్తామన్నారు. ఎంపి కచేసిన లబ్ధిదారుల జాబితా ఇన్‌చార్జి మంత్రి ఆమో దం పొందిన తరువాత వెబ్‌సైట్‌లో, ప్రభుత్వ కార్యాల యాల్లో ప్రదర్శించాలన్నారు. ఆ జాబితా వరుస క్రమం ప్రకారం ప్రతినెలా 15లోపు పారదర్శకంగా ఆర్థిక సహా యం అందుతుందని, స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదు గా పంపిణీ చేయాలన్నారు. జూన్‌ 9న రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలని సూచిం చారు. మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ బీసీ కుల వృత్తుల వారికి కుటుంబంలో ఒకరికి చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం లక్ష రూపాయలు అందిస్తుందని, దీనిని సంపూర్ణంగా వినియోగించుకో వాలని కోరారు. జూన్‌ 14న నిర్వహించే వైద్య దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గానికి అదనంగా లక్ష రూ పాయల నిధులు వైద్య శాఖ నుంచి విడుదల చేస్తున్నామని, పండు గ వాతావరణంలో వైభవోపేతంగా వైద్య శాఖ దినోత్సవం నిర్వ హించాలని పేర్కొన్నారు. కాన్షరెన్స్‌లో కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్య నారాయణ, అదనపు కలెక్టర్‌ వి లక్ష్మీనారాయణ, డీఆర్‌డీవో శ్రీధర్‌, బీసీ సంక్షేమ శాఖాధికారి రంగారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్‌ ఖాన్‌, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మొహమ్మద్‌ మేరాజ్‌ అహ్మద్‌, జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి ఎం నాగలైశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-08T00:24:06+05:30 IST