ఖరారైన జగిత్యాల బీఆర్‌ఎస్ అభ్యర్థిత్వాలు
ABN , First Publish Date - 2023-08-22T02:18:35+05:30 IST
వచ్చే శాసన సభ ఎన్నికలకు బీఆర్ ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాలోనే జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలలో అభ్యర్థిత్వానికి లైన్ క్లియర్ అయింది.
- జగిత్యాల, ధర్మపురిలలో సిట్టింగ్‌లకే..
- కోరుట్లలో ఎమ్మెల్యే తనయుడు సంజయ్‌కు అవకాశం
- బీఆర్‌ఎస్ తొలి జాబితాలోనే మూడు నియోజకవర్గాలకు గ్రీన్ సిగ్నల్
జగిత్యాల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): వచ్చే శాసన సభ ఎన్నికలకు బీఆర్ ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాలోనే జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలలో అభ్యర్థిత్వానికి లైన్ క్లియర్ అయింది. హైద్రాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన పార్టీ అధినేత, ముఖ్య మంత్రి కేసీఆర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే వ్యక్తుల వివరాలను ప్రకటించారు. ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాలలో సిట్టింగ్ లకు అవకాశం కల్పిస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్, డాక్టర్ మాకునూరి సం జయ్ కుమార్‌ల అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. కోరుట్ల నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ కల్వ కుంట్ల సంజయ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.
మూడో సారి బరిలో డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్...
జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడో పర్యాయం డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ బరిలో నిలవనున్నారు. జగిత్యాల, మెట్‌పల్లి ప్రాంతాల్లో కంటి వైద్య నిపుణులుగా సేవలందించి గుర్తింపు పొందిన ఆయన తొలిసారిగా 2014 జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 62,616 ఓట్లు రాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ 54,788 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్ని కల్లో రెండవ పర్యాయం జగిత్యాల నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి జీవన్ రెడ్డిపై విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేకు అవకాశం దక్కడంతో ముచ్చటగా మూడో పర్యాయం బరిలో నిలిచి అదృష్టాన్ని పరీ క్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు.
కోరుట్ల టిక్కెట్ సంజయ్‌కు దక్కించిన కేటీఆర్ మైత్రి...
కోరుట్ల అసెంబ్లీ బీఆర్‌ఎస్ టిక్కెట్‌ను రాష్ట్ర బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసి డెంట్, మంత్రి కేటీఆర్ మైత్రి కారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్‌కు దక్కిన ట్లయింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ క్లాస్‌మెట్‌గా రా జకీయ వర్గాలకు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సుపరిచితుడు. కోరుట్ల ఎమ్మె ల్యే విద్యాసాగర్ రావు ఏకైక కుమారుడైన డాక్టర్ సంజయ్ కొంత కాలంగా కోరుట్ల అసెంబ్లీ బీఆర్‌ఎస్ టిక్కెట్‌ను ఆశిస్తూ వస్తున్నారు. నియోజక వర్గం బీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజాప్రతి నిధులు, ప్రజలతో కొంత కాలంగా సత్సం బంధాలు ఏర్పరుచుకున్నారు. రాష్ట్రంలోని నిమ్స్, కరీంనగర్ చెలిమడ, హై ద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రులలో వైద్యుడిగా పనిచేస్తూనే కోరుట్ల ని యోజకవర్గ ప్రజలకు అవసరమైన తన వంతు వైద్య సేవలు అందిస్తు న్నా రు. రాష్ట్రంలోనే అరుదుగా కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ టిక్కెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే వారసుడికి ఖరారు చేస్తూ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కోరుట్ల అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతం అవుతా యో అన్న అంశం ఓటర్లు తేల్చాల్సి ఉంది.
ఎనిమిదో సారి అసెంబ్లీ బరిలో కొప్పుల..
ధర్మపురి: రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురి నియోజకవర్గ బీఆర్ ఎస్ అభ్యర్థిగా ఖరారైన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎని మిదో సారి పోటీ చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994 సంవత్స రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి మేడారం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ తొలిసారిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నియోజవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో బుగ్గారం రద్దు చేసి కొత్తగా ధర్మపురి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ నియోజకవ ర్గాన్ని ఎస్సీ కేటగిరికి రిజర్వుడ్ చేయడం వల్ల 2009, 2010, 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో ఈశ్వర్‌కే ఆ సమయంలో టీఆర్‌ఎస్ టికెట్ కేటాయించగా వరుస విజయాలు సాధించారు. గతంలో 2004, 2008లో మేడారం ఎస్సీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు, ధర్మ పురి నుంచి నాలుగు సార్లు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా వరుస విజయాలు సాధిం చిన ఈశ్వర్ 2014 నుంచి 2018 వరకు ప్రభుత్వ చీఫ్ విప్‌గా పని చేశారు. అటు తరువాత 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈశ్వర్ 2019 లో జరిగిన రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో కేబినేట్‌లో చోటు దక్కించు కుని సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగతున్నారు. తాజాగా ప్రకటించిన జా బితాలో తిరిగి ఈశ్వర్ అభ్యర్థిత్వం ఖరారు కావడం పట్ల ఆయన మేడారం నుంచి రెండు సార్లు, ధర్మపురి నుంచి నాలుగు సార్లు గెలిచి, రాబోవు ఎన్ని కల్లో ఏడవ సారిగా పోటీకి సిద్ధమవతున్నారు.