కేడీసీసీ బ్యాంక్‌లకు రైతులే ఓనర్లు
ABN , First Publish Date - 2023-08-20T00:34:53+05:30 IST
కేడీసీసీ బ్యాంక్‌కు రైతులే ఓనర్లని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. బీర్‌పూర్ మండలంలోని తుంగూర్‌లో కేడీసీసీ ఆధ్వర్యంలో నూతన బ్యాంక్‌ను శనివారం ప్రారంభించారు. రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం చిత్రపటానికి క్షీరాభిషేం చేశారు.
- నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు
బీర్‌పూర్, ఆగష్టు 19: కేడీసీసీ బ్యాంక్‌కు రైతులే ఓనర్లని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. బీర్‌పూర్ మండలంలోని తుంగూర్‌లో కేడీసీసీ ఆధ్వర్యంలో నూతన బ్యాంక్‌ను శనివారం ప్రారంభించారు. రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం చిత్రపటానికి క్షీరాభిషేం చేశారు. అనంతరం రవీందర్ రావు మాట్లాడుతూ కేడీసీసీ బ్యాంక్‌లకు రైతులే యజమానులని రైతులు లేకుంటే బ్యాంక్ లేదని అన్నారు. రైతుల పిల్లలు ఉన్నత చదువుల కోసం రుణాలు కూడా అందిస్తున్నామని, రైతుల సౌకర్యం కోసం అనేక సదుపాయాలను కేడీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే తుంగూర్‌లో బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు. కేడీసీసీలో రుణాలు తీసుకుని ఇతర బ్యాంక్‌లో పొదుపు చేసుకుంటున్నారని, కేడీసీసీలోనే సొమ్మును దాసుకోవాలని అన్ని బ్యాంక్‌ల కంటే మిత్తి ఎక్కువగా ఇస్తున్నామని గుర్తు చేశారు. అసైన్డ్ భూములకు పంట రుణాలు అందించాలని పలువురు అడుగగా గ్రూపుల వారీగా రుణాలు ఇచ్చేందుకు సహకరిస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ రైతుల సౌకర్యం కోసం తుంగూర్‌లో ప్రత్యేకంగా బ్యాంక్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అరగుండాల ప్రాజెక్టు తెగిపోతే మరమ్మతు పనులను అతి తక్కువ సమయంలో పూర్తి చేసి రైతులకు సాగు నీరును అందిస్తున్నామన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత మాట్లాడుతూ రైతుల క్షేమమే కేసీఆర్ లక్ష్యమని అందుకోసమే రైతులకు రెండు పంటల సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో రోళ్లవాగు ఆధునికీకరణ పనులకు నిధులు కేటాయించారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గంలో కేసీఆర్ హయాంలో మౌలిక వసతుల కల్పనకు వెయ్యి కోట్లు ఖర్చు చేసిందన్నారు. అనంతరం రుణమాఫీ అయిన రైతులకు మళ్లీ కొత్త రుణాలను నాయకుల చేతుల మీదుగా చెక్కులను అందించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా సహకార అధికారి రామానుజాచార్యులు, కేడీసీసీ బ్యాంక్ ముఖ్యకార్యని ర్వహణధికారి సత్యనారాయణ రావు, బీర్‌పూర్ పీఏసీఎస్ చైర్మన్ ముప్పాల రాంచందర్ రావు, సర్పంచ్ గుడిసె శ్రీమతి, నాబార్డు డీడీఎం, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు కొల్ముల రమణ, ఎంపీపీ మసర్తి రమేష్, జడ్పీటీసీ పాత పద్మరమేష్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రాజేశం తదితరులు పాల్గొన్నారు.