ఘనంగా శేష వాహన సేవ

ABN , First Publish Date - 2023-03-30T23:44:49+05:30 IST

మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని శేష వాహనంపై గురువారం రాత్రి ఊరేగించారు.

ఘనంగా శేష వాహన సేవ
శేష వాహనంపై ఊరేగుతున్న స్వామివారు

ఇల్లందకుంట, మార్చి 30: మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని శేష వాహనంపై గురువారం రాత్రి ఊరేగించారు. నిత్యవిధి అనంతరం బలిహరణ, ఆరగింపు చేసిన అనంతరం శేష వాహనం సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T23:44:49+05:30 IST