Share News

‘ఆరోగ్య మహిళ’ కేంద్రం పరిశీలన

ABN , First Publish Date - 2023-12-06T00:20:32+05:30 IST

వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని ఆరోగ్య మహిళ కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌రావు మంగళ వారం పరిశీలించారు.

‘ఆరోగ్య మహిళ’ కేంద్రం పరిశీలన
పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు

వేములవాడ టౌన్‌, డిసెంబరు 5 : వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని ఆరోగ్య మహిళ కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌రావు మంగళ వారం పరిశీలించారు. ఈ సందర్భంగా సుమన్‌మోహన్‌రావు మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య సేవలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, మహిళలకు ప్రత్యేకంగా మంగళవారం ఏర్పాటు చేసిన వైద్యసేవలపై అవగహన కల్పించాలని సూచించారు. జబ్బులు ఉన్నాయని గుర్తించిన తక్షణమే ఆరోగ్యానికి కావాల్సిన చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రతీ మంగళవారం సుమారుగా 10 మంది మహిళలు వైద్య పరీక్షలు నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. వైద్యాధికారి దివ్యశ్రీ, ఏఎన్‌ఎంలు రాజేశ్వరి, మంజుల, వరలక్ష్మి, కవిత తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-12-06T00:20:35+05:30 IST