Share News

ప్రభుత్వ పాఠశాలల్లో సాధికార కమిటీలను ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:42 PM

బాలికా సాధికారత దిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలిక సాధికారత కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో సాధికార కమిటీలను ఏర్పాటు చేయాలి

కరీంనగర్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బాలికా సాధికారత దిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలిక సాధికారత కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయ పాఠశాల విద్యార్థులు, సంక్షేమశాఖ అధికారులతో మహిళా సాధికారతపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్ది వినోదభరితమైన వాతావరణంలో విద్యతో పాటు ఉన్నత విలువలను నేర్పాలని అన్నారు. మంచి పౌరులుగా ఎదగడానికి తల్లిదండ్రులు, ఉపాఽ ద్యాయులు, సమాజం చేతులు కలపాలని సూచించారు. బాలికా సాధికారత కమిటీలను ఏర్పాటు చేసి బాల్యవివాహాలు, లైంగిక దాడులు, లింగవివక్షత, ఆరోగ్య సమస్యలు వంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొనేలా అవగాహన కల్పించాలని పేర్కొ న్నారు. ఆడపిల్లలు కేవలం ఇంజనీర్‌, డాక్టర్లుగా మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్ర మంలో చివరగా స్నేహిత బ్యాడ్జిలను పిల్లలకు, మహిళా ఉద్యోగులకు కలెక్టర్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో సంక్షేమశాఖ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, విద్యాశాఖ అధికారి జనార్ధన్‌రావు, డీఆర్‌డీవో శ్రీలత, జిల్లా మార్కెటింగ్‌ అధికారి పద్మావతి, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి, సఖి సెంటర్‌ నిర్వాహకురాలు లక్ష్మి, డీసీడీవో కృపారాణి, సిబ్బంది, కేజీబీవీ విద్యార్థులు, స్కూల్‌ టీచర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:42 PM