విద్యుత్‌ ఏసీడీ చార్జీలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2023-01-26T00:01:22+05:30 IST

విద్యుత్‌ ఏసీడీ చార్జీలను రద్దు చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రెండు పవర్‌ డిస్ట్రబ్యూషన్‌ కంపెనీలు ఉంటే అందులో కేవలం నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబూషన్‌లో మాత్రమే ఏసీడీ చార్జీలు వసూలు చేయడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 విద్యుత్‌ ఏసీడీ చార్జీలను రద్దు చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ టి జీవన్‌ రెడ్డి

-ఉత్తర తెలంగాణ మంత్రులు స్పందించాలి

-ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

గణేశ్‌నగర్‌, జనవరి 25: విద్యుత్‌ ఏసీడీ చార్జీలను రద్దు చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రెండు పవర్‌ డిస్ట్రబ్యూషన్‌ కంపెనీలు ఉంటే అందులో కేవలం నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబూషన్‌లో మాత్రమే ఏసీడీ చార్జీలు వసూలు చేయడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఏసీడీ చార్జీలకు నిరసనగా కరీంనగర్‌లోని విద్యుత్‌ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట నగర కాంగ్రెస్‌ చేపట్టిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఏసీడీ చార్జీలపై ఉత్తర తెలంగాణ మంత్రులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఏ కంపెనీ ఎంత బకాయి ఉందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల పట్ల ముందు నుంచి వివక్ష చూపుతోందని ఆరోపించారు. జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రావణి కంటతడి పెట్టారని, ఆడబిడ్డ కంటతడి మంచిదా అంటూ ఆయన ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ ఎవరితో పొత్తులు పెట్టుకున్నా మాకు ఏమీ సంబంధం లేదని అన్నారు. నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి జీవన్‌రెడ్డి దీక్ష విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్‌ నాయక్‌, సమద్‌ నవాబ్‌, లింగంపల్లి బాబు, చర్ల పద్మ, గుండాటీ శ్రీనివాస్‌ రెడ్డి, కుర్ర పోచయ్య, దండి రవీందర్‌, గడ్డం విలాస్‌ రెడ్డి, బాలబద్రి శంకర్‌, ఎండీ చాంద్‌, మామిడి సత్యనారాయణ రెడ్డి, పొరండ్ల రమేష్‌, మేకల నర్సయ్య, దన్నసింగ్‌, మెతుకు కాంతయ్య, షబానా మహమ్మద్‌, సలిమొద్ధిన్‌, నాగుల సతీష్‌, ఊరడిలత, వంగళ విద్యాసాగర్‌, కీర్తి కుమార్‌, ఎజ్రా, విక్టర్‌, అష్రాఫ్‌, జాఫర్‌, భారీ, హనీఫ్‌, సోహెల్‌, సిరాజుద్దీన్‌, ఎంహెచ్‌ జోహార్‌, ఇమామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:01:22+05:30 IST