విద్యుత్‌ ఏసీడీ చార్జీలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2023-01-21T23:55:32+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ వినియోగదారులపై అదనంగా వేస్తున్న ఏసీడీ చార్చీలను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ ఏసీడీ చార్జీలను రద్దు చేయాలి

మంథని, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ వినియోగదారులపై అదనంగా వేస్తున్న ఏసీడీ చార్చీలను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. ఏసీడీ చార్జీలకు వ్యతిరేకంగా స్థానిక ట్రాన్స్‌కో డీఈ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌పార్టీ శ్రేణులతో కలిసి శనివారం శ్రీధర్‌బాబు నిరసన వ్యక్తం చేశా రు. ఈసందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యుత్‌ పంపి ణీ సంస్థ ద్వారా ఏసీడీ చార్జీల పేరిట ప్రజలను ఆర్థిక దోపిడీకి గురిచేస్తోందన్నారు. ఏదో ఒక సందర్భంగా ఒక్కసారి నమోదైన అధిక లోడ్‌ను గరిష్టంగా భావించి అద నపు వినియోగ చార్జీలు వసూలు చేయడం చట్ట విరుద్ధమన్నారు. రెగ్యూలేటరీ కమి షన్‌ ఎదుట ఈసారి తానే స్వయంగా పాల్గొని కాంగ్రెస్‌ పార్టీ పరంగా ఏసీడీ చార్జీ లు రద్దు చేయాలని కోరుతామన్నారు. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి ప్రజలను దోచుకుంటుందన్నారు. మంథని మున్సిపాలిటీలో సైతం అదనపు చార్జీల పెంపుపై త్వరలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామన్నారు. ఈ మేరకు డీఈకి వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2023-01-21T23:55:36+05:30 IST