విద్యుత్ ఏసీడీ చార్జీలను రద్దుచేయాలి
ABN , First Publish Date - 2023-01-18T00:11:04+05:30 IST
విద్యుత్ బిల్లులపై ఏసీడీ చార్జీలను వేయడాన్ని నిరసిస్తూ మంగళవారం స్థానిక రాంనగర్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ముట్ట డించి ధర్నాకు దిగారు.
గోదావరిఖని, జనవరి 17: విద్యుత్ బిల్లులపై ఏసీడీ చార్జీలను వేయడాన్ని నిరసిస్తూ మంగళవారం స్థానిక రాంనగర్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ముట్ట డించి ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ హాజరై మాట్లాడుతూ అడిషనల్ కంజక్షన్ డిపాజిట్ బిల్లులను రద్దు చేయాలన్నారు. పేద ప్రజలు ఈ బిల్లులను మోయలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. రోజురో జుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ మోతతో సామాన్య ప్రజలు సతమతమవుతుంటే ఆరు నెలలకోసారి విద్యుత్ చార్జీలను పెంచుతూ ముఖ్యమంత్రి సామాన్యుల నడ్డి విరిస్తున్నార న్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డెవలప్‌మెంట్ చార్జీలు, అడిషనల్ చార్జీల పేరుతో అత్యధికంగా బిల్లులను వేస్తూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏసీడీ చార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పోటీపడి ధరలను పెంచుతున్నాయని, కేంద్రం పెట్రో ల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిత్యావస ర వస్తువుల ధరలు, విద్యుత్, ఆర్‌టీసీ చార్జీలు పెంచుతూ సామా న్యులను బ్రతకనివ్వకుండా చేస్తోందని, ఏసీడీ చార్జీలను వెంటనే రద్దు చేయకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అనంత రం ఏఈడీ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహంకాళి స్వామి, పెద్దెల్లి తేజస్విని ప్రకాష్, గాదం విజయనందు, గట్ల రమేష్, నాయకులు బొమ్మక రాజేష్, చుక్కల శ్రీనివాస్, దాసరి విజయ్, నాజీమ్, ఆసిఫ్ పాషా, అప్పాసి శ్రీనివాస్, మేకలపోషం, పీక అరుణ్‌కుమార్, స్వప్న, జ్యోతి, వనమాల, సంధ్య, సునీత, మేకల స్వప్న పాల్గొన్నారు.