కోడ్‌ కూసిన వేళ..

ABN , First Publish Date - 2023-10-11T00:49:14+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలకు నగారా మో గడంతో జిల్లాలో అధికార యంత్రాగం, రాజకీయ పక్షాలు ఎన్నికల రణ రంగానికి అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

కోడ్‌ కూసిన వేళ..

- ప్రచారంపైనే ప్రధాన రాజకీయ పక్షాల దృష్టి

- అభివృద్ధి, సంక్షేమ పనులకు బ్రేక్‌...

- ఎన్నికల ఏర్పాట్ల పనుల్లో అధికారులు నిమగ్నం

పోలీసుల తనిఖీలు ముమ్మరం..సామాజిక మాధ్యమాలపై నిఘా

పకడ్బందీగా ఎన్నికల నియమావళి అమలుపై దృష్టి

జగిత్యాల, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలకు నగారా మో గడంతో జిల్లాలో అధికార యంత్రాగం, రాజకీయ పక్షాలు ఎన్నికల రణ రంగానికి అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు చిన్న పార్టీలు సైతం ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరిం చా యి. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయి ప్రచారంలో వేగం పెం చిం ది. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల అ సెంబ్లీ నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరిట కలి యతిరిగారు. జమిలీ ఎన్నికలు వస్తాయనే ప్రచారం నేపథ్యంలో క్షేత్ర స్థా యిలో ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులంతా కొన్ని రోజుల పాటు కొంత స్థబ్దత పాటించారు. పార్లమెంటు సమావేశాలు పూర్తి కాగానే షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించడంతో ఎన్నికల ప్రచా రంతో పాటు అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. కాంగ్రెస్‌, బీజేపీ త మ అభ్యర్థులను రానున్న వారం పది రోజుల్లో ప్రకటించనున్న నేపథ్యం లో ఆ లోపే క్షేత్రస్థాయిలో ఒక దఫా ప్రచారం పూర్తి చేసేలా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కసరత్తు పూర్తి చేశారు. అధికార యంత్రాంగం ఎన్నికల ఏ ర్పాట్లకు అవసరమైన అన్ని విధాల పనులను పూర్తి చేసుకుంటోంది. పో లీసులు సైతం ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన క సరత్తులను పూర్తి చేసింది.

కాంగ్రెస్‌, బీజేపీలో కొనసాగుతున్న కసరత్తు..

ఇప్పటికే బీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థులను ప్రకటించింది. ధర్మపురి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జగిత్యాల నుంచి సిట్టింగ్‌ ఎ మ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, కోరుట్ల నుంచి ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తనయుడు డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ పోటీలో ఉండనున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలలో అభ్యర్థుల ఎంపిక విషయంలో క సరత్తులు జరుగుతున్నాయి. ధర్మపురి నుంచి బీఎస్‌పీ అభ్యర్థిగా నక్క వి జయ్‌కుమార్‌ను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. మిగిలిన చిన్న పార్టీ లు సైతం అభ్యర్థుల ప్రకటన చేయడానికి అవసరమైన కసరత్తులు చే స్తున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలు ప్రచార వ్యూహానికి పదును పెడు తున్నాయి.

అంకెలతో ప్రచారానికి బీఆర్‌ఎస్‌ సన్నద్ధం..

ప్రస్తుత శాసన సభ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నాయకులు ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని నియోజక వర్గాల్లోనూ ఇంటింటి ప్రచారంలోనూ సదరు కుటుంబానికి, గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి ఈ తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజ లు ఎంత మేరకు లబ్ది పొందారు, అభివృద్ధి పనులను అంకెలతో వివరిం చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గం, మండ లం, గ్రామం, గృహం, వ్యక్తిగత వారీగా వివిధ ప్రభుత్వ పథకాలు, సంక్షే మ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల్లో లబ్ధిపొందిన వారి జాబితాను సిద్ధం చేసుకున్నారు. ఇటీవల జగిత్యాల, కోరుట్ల, ధర్మపురిలో ఈ మేరకు ప్రచా రాన్ని ప్రారంభించిన నాయకులు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పద్ధతిని అవ లంభిస్తున్నారు. ప్రతీ ఇంటికి ఏ పథకం ద్వారా ఎంత మేరకు లబ్ధి చేకూ రిందనే విషయంలో లెక్కలు తీస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి ఇప్పటికే వచ్చిన ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో ప్రత్యేక అధికార బృం దాలు ఈ అంశాలపైనే దృష్టి సారించి అవసరమైన సమాచారాన్ని అప్ప గించినట్లుగా తెలుస్తోంది.

ఎన్నికలకు సన్నద్ధంగా అధికార యంత్రాంగం..

ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం అయింది. 2023 డిసెంబరు 13వ తేదిన ప్రభుత్వం రద్దేయ్యే అవకాశం ఉన్నందున ఆ లో గా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు వీలుగా షెడ్యూల్‌ విడుదల అ యింది. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళికి అనుగునంగా ఎన్నికలు జరిపేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఓటరు జాబితాను సిద్ధం చేసి వివరాలను ప్రకటించారు. కలెక్టరేట్‌లో ఎన్నికల సెల్‌, మీడియా సెంటర్లను ఏర్పాటు జరిపారు. ఈ ఏర్పాట్లతో పాటు ఎ న్నికల సందర్భంగా అనుసరించాల్సిన విధానాలపై ఎప్పటికప్పుడు సమీక్ష లు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

పెరిగిన పోలీసు నిఘా..

రానున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. పొరుగు జిల్లాల నుంచి మద్యం, డబ్బులు, బోగస్‌ ఓట్లు జిల్లాలోకి రాకుండా చెక్‌పోస్టుల ను ఏర్పాటు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులు, రెవెన్యూ యం త్రాంగాలతో సమన్వయం చేసుకునేందుకు ఇటీవల నిజామాబాద్‌లో ని ర్వహించిన పోలీసు ఉన్నత స్థాయి సమావేశానికి ఎస్పీ ఎగ్గడి భాస్కర్‌ హాజరయ్యారు. ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్లు, పాత నేరస్థులపై ని ఘా ఉంచారు. జిల్లా వ్యాప్తంగా తరుచుగా నేరాలకు పాల్పడే వారిపై ఆ యా పోలీసు స్టేషన్‌ల వారిగా గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం తో పాటు వారిని ఠాణాలకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇవ్వడంపై దృష్టి సా రించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీల సామాజిక మాద్యమాలపైనా నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. నియో జకవర్గాల వారిగా అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి వాటిని జియో మ్యాపింగ్‌ చేశారు. అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమె రాలను బిగిస్తున్నారు.

Updated Date - 2023-10-11T00:49:14+05:30 IST