స్థానికంగా ఉద్యోగాల కల్పనకు కృషి

ABN , First Publish Date - 2023-02-21T00:31:49+05:30 IST

మంథని నియోజకవర్గం లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని, స్థానికంగా ఉద్యోగాల కల్పనకు తనవం తు ప్రయత్నం చేస్తానని పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్ట మధు అన్నారు.

స్థానికంగా ఉద్యోగాల కల్పనకు కృషి
నియామక పత్రాలు అందిస్తున్న పుట్ట మధు

- జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

మంథని, ఫిబ్రవరి 20: మంథని నియోజకవర్గం లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని, స్థానికంగా ఉద్యోగాల కల్పనకు తనవం తు ప్రయత్నం చేస్తానని పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్ట మధు అన్నారు. స్థానిక ఎస్‌ఎల్‌బీ గార్డెన్స్‌లో పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌ మేళాను పుట్ట మధు జ్యోతి ప్రజ్వలన చేసి సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మం ది యువత ఉన్నత చదువులు చదివి కూడా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తన వద్దకు ఎంతో మంది తల్లిదండ్రులు వచ్చి తమ బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించాలని కోరుతుండ టం బాధగా ఉందన్నారు. అందుకే పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా ఇలాంటి మెగా జాబ్‌ మేళాను ఏర్పాటుచేసి నిరుద్యోగులకు ఉపాధి అవ కాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈజాబ్‌ మేళాలో 52 బహుళ జాతి కంపెనీలు ఉద్యోగ కల్పన కోసం ఇక్కడి రావడం ఆనందంగా ఉందన్నారు. స్థానికం గా అందరికి ఉపాధి ఆవకాశాలను కల్పించడానికి తమ వంతుగా కృషి చేస్తున్నామన్నారు. యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమన్నారు. అందుకే అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుమన్నారు. జాబ్‌లు పొందిన వారు తమ వేతనాల ద్వారా ట్రస్టు సేవల కోసం నెలకు ఒక్క రూపాయి విరా ళంగా ఇవ్వాలని కోరారు. భూపాలపల్లి జడ్పీ చైర్మన్‌ జక్కు శ్రీహర్షిణి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువ తకు ఉపాధి కల్పించడానికి పుట్ట మఽధు ఇలాంటి మెళా జాబ్‌ మేళా ఏర్పాటు చేయడం హర్షణీయమ న్నారు. కార్యక్రమంలో మంథని మున్సిపల్‌ చైర్‌పర్స న్‌ పుట్ట శైలజ, పుట్ట శ్రీహర్ష, నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

- జాబ్‌ మేళాకు విశేష స్పందన..

పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాకు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. 52 బహుళ జాతి కంపెనీలు మేళాకు హాజరుకాగా వివిధ ఉద్యో గాల కోసం 1,800 మంది నిరుద్యోగులు దరఖాస్తు లు చేసుకున్నారు. వివిధ కంపెనీల ఉద్యోగాల అర్హ తను బట్టి 47 కంపెనీల్లో 1,052 మంది యువతీ, యువకులు పలు ఉద్యోగాలకు అర్హత సాధించారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల కు పుట్ట మధు ఎంపిక పత్రాలు పంపిణీ చేశారు.

Updated Date - 2023-02-21T00:31:56+05:30 IST