Share News

పెద్దఎత్తున నిధులు తెచ్చేందుకు కృషి

ABN , First Publish Date - 2023-12-10T23:34:33+05:30 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని, పెద్దఎత్తున నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు.

పెద్దఎత్తున నిధులు తెచ్చేందుకు కృషి

పెద్దపల్లిటౌన్‌, డిసెంబరు 10: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని, పెద్దఎత్తున నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. ఎమ్మె ల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా పెద్దపల్లికి వచ్చిన విజయరమణరావుకు పార్టీ శ్రేణులు ఆదివారం ఘన స్వాగతం పలికారు. జెండా కూడలికి చేరుకున్న తర్వాత రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే విజయరమణారావు నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విజయరమణారావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో భారీ మెజారిటతో గెలిపించిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సంక్షేమ, అభివృద్ధికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పెద్దపల్లికి బైపాస్‌ రోడ్డు వేయి స్తానని, జిల్లాకేంద్రంలో జిల్లా కోర్టు ఏర్పాటు చేయిస్తానన్నారు. ప్రజల చిర కాల కోరిక పెద్దపల్లిలో బస్‌డిపో ఏర్పాటుచేసే దిశగా చర్యలు తీసుకుంటాన ని హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయరమణారా వును గజమాలలతో ఘనంగా సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎల్‌. రాజయ్య, గోపగాని సారయ్యగౌడ్‌, ప్రకాష్‌ రావు, అన్నయ్యగౌడ్‌, సాయిరి మహేందర్‌, సురేష్‌గౌడ్‌, కొలిపాక శ్రీనివాస్‌, నూగిల్ల మల్లయ్య, మందల సత్యనారాయణరెడ్డి, ఈర్ల స్వరూప, రేగుంట అశోక్‌గౌడ్‌, మస్రత్‌, బుతగడ్డ సంపత్‌, యాట దివ్య, సందనవేని సునీత రాజేందర్‌, బొడ్డుపెల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:34:36+05:30 IST