ఆయిల్‌పామ్‌కే ‘డ్రిప్‌’

ABN , First Publish Date - 2023-03-19T00:41:54+05:30 IST

పండ్లు, కూరగాయలు, ఇతర ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు సబ్సిడీపై డ్రిప్‌ ఇరిగేషన్‌(బిందు సేద్యం) పరికరాలను అందజేయాల్సిన ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతులకు మాత్రమే ఇస్తోంది. దీంతో మిగతా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆయిల్‌పామ్‌కే ‘డ్రిప్‌’
ఆయిల్‌పామ్‌

- ఇతర పంటలకు సబ్సిడీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

- ఇబ్బందుల్లో కూరగాయలు, పండ్ల తోటల రైతులు

(ఆంరఽధజ్యోతి, పెద్దపల్లి)

పండ్లు, కూరగాయలు, ఇతర ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు సబ్సిడీపై డ్రిప్‌ ఇరిగేషన్‌(బిందు సేద్యం) పరికరాలను అందజేయాల్సిన ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతులకు మాత్రమే ఇస్తోంది. దీంతో మిగతా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ దిగబడులను సాధించేందుకు అవకాశాలుంటాయి. కూరగాయలు, పండ్ల తోటలు, పప్పు దినుసుల పంటలను ప్రోత్సహించేందుకు పదిహేను సంవ త్సరాల నుంచి ఆయా ప్రభుత్వాలు మైక్రో ఇరిగేషన్‌ శాఖ ద్వారా డ్రిప్‌, స్ర్పింక్లర్ల పరికరాలను సబ్సిడీపై అందజేస్తున్నా యి. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్‌ శాఖను ఉద్యానశాఖలో విలీ నం చేశారు. ఆ శాఖ ద్వారా డ్రిప్‌ పరికరాలను అందజేస్తు న్నారు. జిల్లాలో అత్యధికంగా రైతులు వరి, పత్తి, మొక్క జొన్న పంటలను సాగు చేస్తున్నారు. పండ్ల తోటు, కూర గాయల పంటలు, ఇతరత్రా పంటలు 10వేల ఎకరాల్లో సాగ వుతాయి. ఈ పంటలకు సాగు నీటిని డ్రిప్‌ ద్వారా అందించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. బిందు సేద్యం వల్ల నీటి వృథాను అరికట్టడంతో పాటు పంట పొలాలు బురదమయం గాకుండా ఉంటాయి. మొక్క లను తక్కువ నీరు అందడం వల్ల పంట కూడా నాణ్యతగా వస్తుంది. మొదట రైతులు బిందు సేద్యంపై ఆసక్తి చూపక పోయినా, ఉద్యాన శాఖ అవగాహన కల్పించడంతో సాగుపై దృష్టి సారించారు. ప్రతి ఏటా జిల్లాలో వెయ్యి నుంచి 2 వేల హెక్టార్లలో డ్రిప్‌ను విస్తరిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం జిల్లాలో 2600 ఎకరాల్లో డ్రిప్‌ సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అన్ని రకాల పంటలను సాగుచేసే రైతులకు బిందు సేద్యం సామగ్రి ఇవ్వడం లేదు. కేవలం ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతులకు మాత్రమే సబ్సిడీపై పరికరాలను అందజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీపై ప్రభుత్వం డ్రిప్‌ పరిక రాలను ఇస్తుండగా, ఇతర రైతులకు 5 ఎకరాల వరకు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. 5 ఎకరాల పైబడి 12.5 ఎకరాల వరకు 80 శాతం సబ్సిడీపై పరికరాలను ఇస్తున్నారు. ఈ పరికరాలపై జీఎస్టీని రైతులే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో డ్రిప్‌ పరికరాలను ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఫ దరఖాస్తు చేసుకున్నా..

ఇప్పటి వరకు జిల్లాలో 1211 ఎకరాల్లో రైతులు ఆయిల్‌ పామ్‌ పంటను వేశారు. ఇందులో 1207 ఎకరాల్లో 355 మంది రైతులకు డ్రిప్‌ పరికరాలను అందజేశారు. వీటి కింద సదరు రైతులకు 2 కోట్ల 33 లక్షల రూపాయల సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేసింది. ఆయిల్‌ పామ్‌ సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులు డ్రిప్‌ పొందిన తర్వాతనే వారికి మొక్కలను ఇస్తున్నారు. లక్ష్యం బాగానే ఉన్నప్పటికీ ఆయిల్‌ పామ్‌ పంటను వేసే రైతులకు మాత్ర మే డ్రిప్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. ప్రధానంగా పండ్ల తోటలు, కూరగాయల పంటలను సాగు చేసే రైతులకు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పలు వురు రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోతున్నది. ఒక ఎకరం భూమిలో కూరగాయల పంటల సాగు కోసం డ్రిప్‌ పరికరాలను సొంతంగా సమకూర్చుకోవా లంటే 30 నుంచి 35 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఆయిల్‌ పామ్‌ రైతులకు సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలను ఎక్కువ మొత్తంలో ఇచ్చుకుంటూ లక్ష్యంలో ఇతర పంటలను సాగు చేసే ఇతర రైతులకు కనీసం 20శాతం ఇచ్చినా ఇబ్బంది ఏమి ఉండదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు కూడా సబ్సిడీపై డ్రిప్‌ పరికరా లను అందజేయాలని పండ్లు, కూరగాయలు, ఇతర పంటలను సాగుచేసే రైతులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా ఉద్యాన శాఖాధికారి జగన్మోహన్‌రెడ్డిని వివరణ కోరగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయిల్‌పామ్‌ పంటలను సాగు చేసే రైతులకు డ్రిప్‌ పరికరాలను అందజేస్తున్నామని తెలిపారు. ఇతర రైతుల నుంచి దరఖాస్తులు వచ్చిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లామని ఆయన తెలిపారు.

Updated Date - 2023-03-19T00:41:54+05:30 IST