రాష్ట్రంలో బీజేపీ మతోన్మాద శక్తులకు చోటివ్వొద్దు
ABN , First Publish Date - 2023-03-05T01:18:42+05:30 IST
రాష్ట్రంలో బీజేపీ వంటి మతోన్మాద శక్తులకు చోటివ్వొద్దని సీపీఎం రాష్ట్ర కార్యాదర్శి వర్గ సభ్యుడు ఎస్.వీరయ్య అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్ అంబబాయి కల్యాణ మండపంలో శనివారం సీపీఎం జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం నిర్వహించారు
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీరయ్య
సిరిసిల్ల రూరల్, మార్చి 4: రాష్ట్రంలో బీజేపీ వంటి మతోన్మాద శక్తులకు చోటివ్వొద్దని సీపీఎం రాష్ట్ర కార్యాదర్శి వర్గ సభ్యుడు ఎస్.వీరయ్య అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్ అంబబాయి కల్యాణ మండపంలో శనివారం సీపీఎం జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు, వీర్నపల్లి ఎంపీటీసీ మల్లారపు అరుణ్ కుమార్, సూరం పద్మ అధక్ష్యతన జరిగిన సమా వేశంలో వీరయ్య మాట్లాడారు. పేదలకు ఆహార సబ్సిడీ రద్దు చేస్తూ గ్రామీణ ఉపాధిహామీ చట్టానికి నిధులు తగ్గిస్తూ పేదల పొట్టలు కొట్టి కోటీశ్వర్లులకు మాత్రం రాయితీలు ఇచ్చిందన్నారు. అదానీ, అవినీతి మోదీ మొదటి ముద్దాయి అన్నారు. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీల్లో దేశ ప్రజలు దాచుకున్న సంపదను మోదీ సర్కారు అదానీ వంటి వ్యాపారాలకు అప్పనంగా ఇచ్చిందన్నారు. గవర్నర్లు బీజేపీ ఏజెంట్లుగా రాష్ట్రాలలో ప్రజలెన్నుకున్న పాలనలను అస్థిర పర్చుకునే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచుతూ పేదలపై భారం మోపుతున్న విషయాలపై ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. ఈ నెల 23న ఆదిలాబాద్ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు. బస్సు యాత్ర 26న సిరిసిల్లకు చేరుకోనుందన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, జగదీష్ జిల్లా పార్టీ కార్యదర్శి మూషం రమేష్, జిల్లా కమిటీ నాయకులు కోడం రమణ, ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, ఎరవెళ్లి నాగరాజు, ముక్తి కాంత అశోక్, అన్నల్ దాస్ గణేష్ శ్రీరాం సదానందం, గురజాల శ్రీధర్ మళ్లారపు ప్రశాంత్ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు
కమ్యూనిస్టుల పోరాటాలతో పేదలకు ఆత్మగౌరవం
సిరిసిల్ల ప్రాంతంలో కమ్యూనిస్టులు చేపట్టిన భూ పోరాటాలు పేదల ఆత్మగౌరవాన్ని పెంచాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్. వీరయ్య అన్నారు శనివారం సీపీఎం ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల సాధన సదస్సు సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ సిరిసిల్లలో ఇల్లులేని పేదలందరికీ ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డ్రా లో పేర్లు రాని 963 మందికి తక్షణమే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని అన్నారు. ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇళ్ల సాధనకు దశల వారీగా నిర్మించిన పోరాటాలు అభినందనీయమన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల డ్రాలో పేర్లు రానివారికి న్యాయం జరిగే వరకు సీపీఎం పేదలకు అండగా నిలుస్తుందన్నారు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కైలాబ్ బాబు, జగదీష్, సీపీఎం జిల్లా నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, సూరం పద్మ, నక్క దేవదాస్, రాజశేఖర్, పోచమల్లు, సురేష్, గోవింద్, లక్ష్మణ్, సామల కవిత, గట్ల స్వప్న, లావణ్య తదితరులు పాల్గొన్నారు.