ధర్మపురిలో ఘనంగా వేంకటేశ్వరుడి డోలోత్సవం
ABN , First Publish Date - 2023-03-10T00:51:16+05:30 IST
ధర్మపురి క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి తెప్పోత్సవం, డోలోత్సవం గురువారం ఘనంగా జరిగింది.
ధర్మపురి, మార్చి 9: ధర్మపురి క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి తెప్పోత్సవం, డోలోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ తదితర వేద బ్రాహ్మణుల మంత్రో చ్ఛారణల మధ్య మధ్యాహ్నం స్వామివారి ఉత్సవమూర్తిని సేవలపై ఆశీనులు చేశారు. అనంతరం పురవీధుల గుండా బ్రహ్మ పుష్కరిణికి తీసుకొచ్చారు. బ్రహ్మపుష్కరిణిలో హంస వాహనంపై స్వామి వారిని ఉంచి అర్చకులు తెప్పోత్సవం జరిపారు. అనంతరం బ్రహ్మ పుష్కరిణి మండపంలోని ఊయ లపై ఆశీనులు చేసి డోలోత్సవం జరిపారు. భక్తులు ఉత్తర ద్వారం గుండా లోనికి ప్రవేశిస్తూ స్వామి వారలను దర్శించుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్య ఆధ్వర్యంలో రాత్రి వరకు ఉత్సవ కార్యక్రమాన్ని కొనసాగించారు. బ్రహ్మపుష్కరిణి అందంగా విద్యుత్ దీపాలతో శోభిల్లింది. సీఐ బిళ్ల కోటేశ్వర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు కిరణ్‌కుమార్, నరేష్‌కుమార్, దత్తాత్రి, పలువురు ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సంగి సత్యమ్మ, వైస్‌చైర్మన్, ఆలయ రినోవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య, సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.