పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య

ABN , First Publish Date - 2023-04-13T00:49:02+05:30 IST

భూమి కోసం, భుక్తికోసం, విముక్తి కోసం సామాజిక విప్లవానికి పునాది వేసిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు.

పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య
మెట్‌పల్లిలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు

మెట్‌పల్లి, ఏప్రిల్‌ 12 : భూమి కోసం, భుక్తికోసం, విముక్తి కోసం సామాజిక విప్లవానికి పునాది వేసిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. బుధ వారం పట్టణంలోని జాతీయ రహదారిపై కురుమ సంఘ సభ్యులు నూతనంగా ఏర్పాటు చేసిన కొమురయ్య విగ్రహాన్ని స్థానిక ప్రజ్రాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులతో కలిసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సాధారణ గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించిన కొమురయ్య రైతాంగం కోసం, భూమి కోసం, విముక్తి కోసం మహోన్నత ఉద్యమానికి ప్రజలను ఉత్తేజపరిచి పోరాటానికి ఆద్యు డైన కొమురయ్య తెలంగాణ ప్రాంతానికి చెందివారు కావడం మన గర్వకారణ మని కొనియాడారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌, బీజేపీ రాష్ట్ర నాయకురాలు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, నియోజక వర్గం నాయకులు సురభి నవీన్‌కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ నియోజక వర్గం ఇన్‌చార్జీ జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావు కొమురయ్య విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయుధ పోరాటంలో మొదటి వీరమరణం పొందిన దొడ్డి కొమురయ్య తెలం గాణ ప్రాంతానికి చెందినవారు కావడం గర్వకారణమని, అంతటి గొప్ప వ్యక్తి వి గ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పిలిచినందుకు కురుమ సంఘ సభ్యులకు ధన్యవా దాలు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యేతో పాటు వివిధ పార్టీల నాయకులకు మెట్‌పల్లి కురుమ సంఘ సభ్యులు శాలవా లతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కురుమ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-13T00:49:02+05:30 IST