అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2023-07-04T23:56:32+05:30 IST
గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఆదేశించారు.
పెద్దపల్లి, జూలై 4(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమా వేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి శ్మశానవాటికకు తప్పనిసరిగా నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం కల్పించా లని ప్రభుత్వం నిర్ణయించిందని, మన జిల్లాలో దాదా పు 41 శ్మశానవాటికల్లో నీటి,విద్యుత్ సరఫరా కల్పించా లని ఆదేశించారు. జిల్లాలోని 98 గ్రామ పంచాయతీల్లో నూతన భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మం జూరు చేసిందని, జూలై 10 నాటికి వీటిలో నిర్మాణ పనులు తప్పనిసరిగా ప్రారంభించాలంచారు. జూలై 10 నాటికి ప్రతి మండలంలోని పంచాయతీరాజ్ ఇంజనీ రింగ్ అధికారులు వారి పరిధిలో నూతన గ్రామపంచా యతీ భవన నిర్మాణాల వద్ద, మన ఊరు మనబడి పాఠశాల పనుల వద్ద, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్‌సెంటర్ నిర్మా ణ పనుల వద్ద స్థితిగతులు తెలుపుతూ ఫోటో తీసి అందించాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన పనులు ఆటంకం లేకుండా త్వరితగతిన పూర్తయ్యే విధంగా అధికారులు పర్యవేక్షించాలని సూ చించారు. తెలంగాణకు హరితహారం కింద జిల్లాలో గ్రామీణ ప్రాం తాల్లో దాదాపు 9లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామ న్నారు. ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. బీసీ కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం కింద జిల్లాకు వచ్చిన 10,759 దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని, పంచాయతి కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది దరఖాస్తుదారులు క్షేత్ర స్థాయిలోకుల వృత్తి చేస్తున్నారా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని, సదరు వివరాలను పారదర్శకంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి 6,797 మంది అర్హులను గుర్తించామని, వీరి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను సైతం త్వరితగతిన పరిశీలించాలని, ప్రతి నెలా 15న ప్రజాప్రతి నిధుల సమక్షంలో అర్హులకు లబ్ది చేకూర్చామన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో శ్రీధర్, డీపీవో చంద్రమౌళి, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి రంగారెడ్డి, సంబంధిత అధికారులు తది తరులు పాల్గొన్నారు.