అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి

ABN , First Publish Date - 2023-08-02T00:20:20+05:30 IST

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి

ధర్మారం, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంగళవారం ధర్మారం మండలంలో పలు అభి వృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ గ్రామీణ పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ పలు పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని చెప్పారు. బీఆర్‌ఎప్‌ హయాంలోనే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ధర్మారం,నర్సింగాపూర్‌, లంబాడి తండ బి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ సభ్యురాలు పూ స్కూరి పద్మజ, సింగిల్‌విండో చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మ న్‌ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, సర్పంచ్‌ జితెందర్‌రావు, ఎంపీటీసీ సభ్యుడు తుమ్మల రాం బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - 2023-08-02T00:20:20+05:30 IST