నెలాఖరులోపు సీఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2023-12-06T00:37:19+05:30 IST
సీఎంఆర్ రైస్ డెలివరీ ఈనెల 31లోపు పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సీఎంఆర్ రైస్ డెలివరీ ఈనెల 31లోపు పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌లాల్ ఎఫ్‌సీఐ డివిజనల్ మేనేజర్, కరీంనగర్, జిల్లాలోని రైస్‌మిల్లర్లు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైస్‌మిల్లర్లు ఎఫ్‌సీఐకి సీఎంఆర్ రైస్ డెలివరీలో ఎదురయ్యే ఇబ్బందులను చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రామ్‌ప్రసాద్‌లాల్ మాట్లాడుతూ బాకీ ఉన్న బియ్యాన్ని డిసెంబర్ 31 గడువులోగా ఎఫ్‌సీఐకి డెలివరీ చేయాలని, మిల్లర్ల సమస్యలను పరిష్కరించుటకు తగు చర్యలు తీసుకోవాలని ఎఫ్‌సీఐ డీఎంకు సూచించారు. రైస్ మిల్లర్లు ప్రస్తుత సీజన్ ఖరిఫ్ ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకొని వెంటనే ఓపీఎంఎస్‌లో నమోదు చేసి తద్వా రా రైతులకు సత్వరమే చెల్లింపులు జరిగేలా సహకరించాలని కోరారు. ఈ సమావే శంలో కరీంనగర్ డివిజనల్ ఎఫ్‌సీఐ మేనేజర్, పౌర సరఫరాల సంస్థ జిల్లామేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారి, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.