విఘ్నేశ్వరుడికి కరెన్సీ నోట్లతో అలంకరణ
ABN , First Publish Date - 2023-09-22T23:46:20+05:30 IST
నగరంలో శ్రీ గణేశ్ నవరాత్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తు న్నారు.
- రూ.15లక్షలతో ఆకట్టుకునే ఆకృతులు
కరీంనగర్ కల్చరల్, సెప్టెంబరు 22: నగరంలో శ్రీ గణేశ్ నవరాత్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తు న్నారు. విద్యుత్ దీపాల అలంకరణతో పాటు కరెన్సీ నోట్లతో విఘేశ్వరుడి మండపాలను పోటాపోటీగా తీర్చిదిద్దుతూ భక్తులను ఆకట్టుకుంటున్నారు. నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం విద్యానగర్‌లోని ప్యారీస్ స్ర్టీట్‌లో మొదటిసారిగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. సుమారు 15 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో విభిన్న ఆకృతుల్లో రూపొందించిన మాలలతో మండపాన్ని తీర్చిదిద్దారు. దీన్ని చాలా మంది భక్తులు ఆసక్తిగా తిలకించారు.