దళిత పోరాటాలను ఉధృతం చేయాలి

ABN , First Publish Date - 2023-03-31T00:08:13+05:30 IST

దళితుల సామాజిక హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయం కోసం, కుల వివక్ష నిర్మూలనకు దళిత పోరాటాలను ఉదృతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు.

దళిత పోరాటాలను ఉధృతం చేయాలి
మాట్లాడుతున్న తాళ్లపల్లి లక్ష్మణ్‌

- దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్‌

సిరిసిల్ల టౌన్‌, మార్చి 30: దళితుల సామాజిక హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయం కోసం, కుల వివక్ష నిర్మూలనకు దళిత పోరాటాలను ఉదృతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. గురువారం సిరిసిల్ల పట్టణం కార్మిక భవనంలో దళిత పోరాట సమితి ప్రథమ సభలు జరగాయి. ప్రథమ సభల్లో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడారు. 75 సంవత్సరాల స్వతంత్ర పరిపాలనలో నేటికి దళితులు వెనకబడి ఉన్నారని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, కుల నిర్మూలన కాగితాలకే పరిమితమైంద న్నారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దళితులపై దాడులను పెంచిందని మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దళితులకు నామమాత్రం నిధులను కేటాయిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న దళితులు ఏకతాటిపైకి వచ్చి సామా జిక హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయం కోసం, కుల వివక్ష నిర్మూలనకు దళిత పోరాటాలను చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం దళిత హక్కుల పోరా ట సమితి జిల్లా అధ్యక్షుడు కోరెపు క్రాంతి, ప్రధాన కార్యదర్శి మాట్ల అశోక్‌, గౌరవ అధ్యక్షుడు మంద సుదర్శన్‌లను, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, పట్టణ కార్యదర్శి పంతం రవి అభినందించారు. నాయకులు లింగాల వెంకట్‌, ఖానాపురుం అరుణ్‌, కంసాల లక్ష్మణ్‌, దాట్ల తిరుపతి, గడ్డం ధనుంజయ్‌, కార్యకర్తలు, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:08:13+05:30 IST