పంట నష్టపరిహారం చెల్లించాలి
ABN , First Publish Date - 2023-05-02T23:47:08+05:30 IST
అకాల వర్షాల వలన పంటలు నష్టపోయిన రైతులకు సీఎం ప్రకటించిన ప్రకారం ఎకరాకు రూ.10వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండలంలోని నర్సింహులపల్లి ఎక్స్ రోడ్డు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ధర్మారం, మే 2: అకాల వర్షాల వలన పంటలు నష్టపోయిన రైతులకు సీఎం ప్రకటించిన ప్రకారం ఎకరాకు రూ.10వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండలంలోని నర్సింహులపల్లి ఎక్స్ రోడ్డు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోలో కాంగ్రెస్ పార్టీ జగిత్యా ల జిల్లా అధ్యక్షుడు, ధర్మపురి నియోజకవర్గ ఇన్ చార్జి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మాట్లాడా రు. అకాల వర్షాల వలన తడిసిన రంగు మారిన వరి ధాన్యానికి క్వింటాలుకు పది కిలోలు కటింగ్ చేస్తామని మిల్లర్లు బెదిరిస్తున్నారని ఆయన ఆరో పించారు. తడిసిన ధాన్యానికి ఎలాంటి ఆంక్షలు విధించకుండా యధాతథంగానే ధాన్యంను కొనుగో లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా పంట నష్టానికి గురైన రైతుకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. ఈ రాస్తారోకోలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్, నాయకులు అశోక్, అంజయ్య, కాంపెల్లి రాజేశం, కరేటి వేణు, మాధవ్, సంతోష్, సాయికుమార్, అలువాల రాజే శం తదితరులు పాల్గొన్నారు.