బాధ్యతలు స్వీకరించిన సీపీ సుబ్బారాయుడు
ABN , First Publish Date - 2023-01-27T00:38:12+05:30 IST
కరీంనగర్ పోలీస్‌కమిషనర్‌గా ఎల్ సుబ్బారాయుడు గురువారం పదవీ బాద్యతలు స్వీకరించారు.
కరీంనగర్ క్రైం, జనవరి 26: కరీంనగర్ పోలీస్‌కమిషనర్‌గా ఎల్ సుబ్బారాయుడు గురువారం పదవీ బాద్యతలు స్వీకరించారు. ఇక్కడ సీపీగా పనిచేసిన వి సత్యనారాయణ రాచకొండ కమిషనరేట్ జాయింట్ పోలీస్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీఐడి(అడ్మిన్) హైదరాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న ఎల్ సుబ్బారాయుడు నియమితులయ్యారు. వి సత్యనారాయణ నుంచి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి గంగుల కమలాకర్, డీఐజీ రమేష్, జిల్లా జడ్జి, కలెక్టర్‌ను సీపీ మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీ ఎల్ సుబ్బారాయుడు 2007లో గ్రూపు-1 ద్వారా డీఎస్పీగా పోలీస్ శాఖలో చేరారు. అనంతరం ప్రకాశం జిల్లా మార్కాపురం, ఏలూరులో డీఎస్పీగా పనిచేశారు. తర్వాత నిజామాబాద్, అనంతరం కరీంనగర్‌లో 2012 నుంచి 2017 వరకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా పనిచేశారు. రెండు సంవత్సరాలు సీఐడీ విభాగంలో ఎస్పీగా పనిచేశారు. పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎల్ సుబ్బారాయుడును డీసీపీ ఎస్ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ జి చంద్రమోహన్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్‌రావు, విజయసారధి, విజయ్‌కుమార్, ప్రతాప్, ఎస్‌బీఐ వెంకటేశ్వర్లు, సంతోష్‌కుమార్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.