గ్రామీణ రోడ్ల నిర్మాణంతో ప్రజలకు సౌకర్యం

ABN , First Publish Date - 2023-03-30T23:42:07+05:30 IST

గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణంతో ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

గ్రామీణ రోడ్ల నిర్మాణంతో ప్రజలకు సౌకర్యం
రోడ్డు పనులను ప్రారంభిస్తున్న మంత్రి గంగులకమలాకర్‌

కరీంనగర్‌ రూరల్‌, మార్చి 30: గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణంతో ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని చామనపల్లి, ఇరుకుల్ల రోడ్డు పనులకు భూమి పూజ, దుబ్బపల్లి గ్రామంలో బుడిగజంగాల కమ్యునిటీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చామనపల్లి, ఇరుకుల్ల గ్రామాలను కలుపుతూ బీటీ రోడ్డు నిర్మాణానికి పది కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. నియోజక వర్గ వ్యాప్తంగా అన్ని కమ్యునిటీలకు సంబంధించిన భవనాల నిర్మాణాలకు ప్రత్యేక చొరవ చూపిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, పీఏసీఎస్‌ చైర్మన్లు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, నర్సయ్య, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T23:42:07+05:30 IST