కాలేజీ స్థానంలో గ్రంథాలయ నిర్మాణం మానుకోవాలి

ABN , First Publish Date - 2023-09-22T23:51:25+05:30 IST

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గర్ల్స్‌ జూనియర్‌ కాలేజీ భవనాన్ని కూల్చి, దాని స్థానంలో గ్రంథాలయాన్ని నిర్మిస్తామననే ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఎం వ్యతిరేకిస్తోందని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎర్రవెల్లి ము త్యంరావు అన్నారు.

కాలేజీ స్థానంలో గ్రంథాలయ నిర్మాణం మానుకోవాలి

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు 22 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గర్ల్స్‌ జూనియర్‌ కాలేజీ భవనాన్ని కూల్చి, దాని స్థానంలో గ్రంథాలయాన్ని నిర్మిస్తామననే ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఎం వ్యతిరేకిస్తోందని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎర్రవెల్లి ము త్యంరావు అన్నారు. స్థానిక శాంతినగర్‌లోని పార్టీ ఆఫీసులో పెద్దపల్లి డివిజన్‌ సమా వేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ముత్యంరావు మాట్లాడారు. కాలేజీ స్థానంలో గ్రంథాలయాన్ని నిర్మించకూడదని శంకుస్థాపనకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి సిద్ధమవుతున్న విద్యార్థినులు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ ఎఫ్‌ నాయకులపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని సీపీఎం ఖండిస్తోందన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం తమ పద్ధతి మార్చుకొని గర్ల్స్‌ జూనియర్‌ కాలేజీకి కొత్త భవనం నిర్మించాలన్నారు. గ్రంథాలయాన్ని వేరే దగ్గర నిర్మించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కమిటీ సభ్యులు జి, జ్యోతి, కళ్లేపల్లి అశోక్‌, నాయకులు సిపెల్లి దిలీప్‌, నవీన్‌, శ్రీనివాస్‌, సురేష్‌, లక్ష్మణ్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:51:25+05:30 IST