అభివృద్ధిని జీర్ణించుకోని కాంగ్రెస్ నాయకులు
ABN , First Publish Date - 2023-06-26T00:21:25+05:30 IST
తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు జీర్ణించు కోవడం లేదని, మధ్య మానేరును మధ్యలోనే వదిలిపెట్టి ప్యాకేజీ 9పై కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా టీఎస్‌పీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీ ణ్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 25: తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు జీర్ణించు కోవడం లేదని, మధ్య మానేరును మధ్యలోనే వదిలిపెట్టి ప్యాకేజీ 9పై కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా టీఎస్‌పీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీ ణ్ అన్నారు. ఆదివారం సిరిసిల్ల పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గడిచిన 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని చెప్పడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవిర్భావ దశాబ్ది ఉత్సవాల పండుగ జరుపుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులపై అంకెలతో సహా ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. తెలంగాణ వచ్చాక బీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయడంతో తెలంగాణ ఈ రోజు స్యసశ్యా మలమైందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఎగువమానేరు నిపుతానని ఏం నింపాడని మీరేం చూశారని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వేసవికాలంలో కూడా ఎగువ మానేరు మధ్య మానేరు మత్తడు దుంకుతున్నాయని అన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కేకే మహేం దర్‌రెడ్డిలు కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వా ములు కావాలని తద్వారా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కనబడుతుంద న్నారు. తెలంగాణ రాష్ట్రం పుట్టింది 2001లో సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది 1999లో మాత్రమేనని అన్నారు. అప్పటి నుంచి మీ మొఖాలు చెల్లవని ఓటేసే వారు నియోజకవర్గంలో లేరని అన్నారు. ఇక్కడ లేని పార్టీని పట్టుకొని మేము అధికారంలోకి వస్తామంటూ శని, ఆది, బుధవారం వచ్చే నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్టీ జెండావిష్కరణలు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదని అది వారి హక్కుగా భావిస్తామన్నారు. అఽభివృద్ధిపై నిర్మాణాత్మకంగా సలహాలు ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి మేము తీసుకెళ్లామని సమస్యల పరిష్కారంలో ముందుంటామన్నారు. మంత్రి కేటీఆర్ ఐదోసారి గెలుస్తున్నారని నాలుగు సార్లు చెల్లని రూపాయి ఐదో సారి చెల్లుతుందని అనుకోవడం భ్రమ అన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ ప్రపంచమే అబ్బురపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. మల్కపేట రిజర్వాయర్ పనులు కొన్ని సాంకేతిక కారణాలతో అగినప్పటికీ మండు వేసవిలో ఎగువ మానేరు ఆయకట్టు చివరి భూములకు కూడా నీరు అందించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిది అన్నారు. మల్కపేట రిజర్వాయర్‌ను నీళ్లతో నింపే క్షణాలు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కేటీఆర్, పార్లమెంట్ ఎన్నికలో బీఆర్‌ఎస్ విజయం ఖాయమన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఉపాధ్యక్షుడు సత్తార్, నాయకులు అడగట్ల మురళి, శ్రీనివాస్ పాల్గొన్నారు.