కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలు ఇంటింటికీ తీసుకెళ్లాలి
ABN , First Publish Date - 2023-09-19T23:49:57+05:30 IST
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గ్యారెంటీ పథకాలు తెలంగాణ ప్రజల హక్కు పత్రమని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అన్నారు.

ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి
రాయికల్, సెప్టెంబరు 19: కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గ్యారెంటీ పథకాలు తెలంగాణ ప్రజల హక్కు పత్రమని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అన్నారు. మండలంలోని ఇటిక్యాల గ్రా మంలో మంగళవారం గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. రాయికల్ నుంచి ఇటిక్యాల వరకు కాంగ్రెస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. జీవన్‌రెడ్డికి ఘ న స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇటిక్యాల గ్రామంలో 150 మందికి పైగా యు వకులు పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్సీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సం దర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు అదనంగా కాంగ్రెస్ అమలు చేయబోయే ఎన్నికల ప్రణాళికను ప్రకటించిన సోనియా గాంధీ ప్రకటించారని అన్నారు. యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరి మరింత ఆత్మస్థైర్యాన్ని నింపారని అన్నారు. దళితబంధు నెపంతో దళితులను మోసం చేస్తున్నారని అన్నారు. ఇంటి నిర్మాణానికి మొ దట్లో రూ.5 లక్షలు ఇచ్చి ఇప్పుడు రూ.3 లక్షలు ఇస్తామంటున్నారని అన్నారు. పెరిగిన బడ్జెట్‌కు అనుగుణంగా చేయూత పథకం కింద రూ.4 వేల పెన్షన్ ఇస్తామని, గృహ జ్యోతి కింద ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామని పేర్కొ న్నా రు. ఉన్నత విద్య కోసం ప్రభుత్వం నుంచి ఉచితంగా రూ.15 లక్షల ఆర్థిక సహాయం, వ రి మద్ధతు ధరకు అనుగుణంగా ప్రతి క్వింటాల్‌కు రూ.15 వేలు ఇస్తామన్నారు. భూమి లేని నిరుపేదలకు ఏడాదికి ఆర్థిక సహాయంగా రూ.12 వేలు ఇస్తామని, కాంగ్రెస్ గ్యా రెంటీ పథకాలను కార్యకర్తలు ప్రతి ఇంటికి చేరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో చొప్పదండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేడిపల్లి సత్యం, డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు గోపి రాజరెడ్డి, రవీందర్ రావు, కొమ్ముల రాధఆదిరెడ్డి, మారంపెల్లి గంగాధర్, రమేష్, అల్లూరి మహేందర్ రెడ్డి, దారం ఆదిరెడ్డి, గుండ మధు, కాటిపెల్లి గంగారెడ్డ, యూత్ కాంగ్రెస్ నాయకులు సుధీర్, లక్ష్మణ్, కోటవేని రాజేందర్, వేముల మురళి, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.