న్యాయవ్యవస్థపై నమ్మకం పెంపొందించాలి

ABN , First Publish Date - 2023-03-26T00:17:10+05:30 IST

సమాజంలో న్యాయవిదానంపై నమ్మకం పెంపొం దించుకోవాలని హై కోర్టు చీఫ్‌ న్యాయమూర్తి ఉజ్జల్‌ బుయాన్‌ అన్నారు.

న్యాయవ్యవస్థపై నమ్మకం పెంపొందించాలి
భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న చీఫ్‌ జస్టిస్‌

హై కోరుట్ల చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ బుయాన్‌

కోరుట్ల, మార్చి 25 : సమాజంలో న్యాయవిదానంపై నమ్మకం పెంపొం దించుకోవాలని హై కోర్టు చీఫ్‌ న్యాయమూర్తి ఉజ్జల్‌ బుయాన్‌ అన్నారు. శనివారం పట్టణానికి విచ్చేసిన న్యాయమూర్తి ఉజ్జల్‌ బుయాన్‌, న్యాయ మూర్తులు పి. నవీన్‌రావు, జువ్వాడి శ్రీదేవి, సంతోష్‌ రెడ్డి, అనుపమ చక్ర వర్తి పుల్ల కార్తిక్‌లకు పట్టణ శివారులోని పశువైద్య కళాశాలలో జిల్లా ఎస్‌ పీ భాస్కర్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించా రు. కోర్టు భవన నిర్మాణంకు విచ్చేసిన న్యాయమూర్తులకు కోరుట్ల పట్ట ణ వేదపండితులు పూర్ణ కుంబంతో స్వాగతం పలుకగా ముస్లిం, కౌస్త్రవ మత పెద్దలు ప్రార్థనలు చేసారు. అనంతరం పశువైద్య కళాశాల వద్ద జా తీయ రహదారిని అనుకోని నూతన కోర్టు భవన నిర్మాణంకు న్యాయ మూర్తి ఉజ్జల్‌ బుయాన్‌ న్యాయమూర్తులు, న్యాయవాదులతో కలసి ప్రా రంభించారు. ఈ సందర్బంగా న్యాయమూర్తి ఉజ్జల్‌ బుయాన్‌ మాట్లాడా రు. కోర్టు భవన నిర్మణంను న్యాయవాదులు ఐక్యమత్యంతో ఉండి పూర్తి చేసుకోవాలని అన్నారు. కేసు పరిష్కరంపై నిబద్దతో మొలిగి అన్ని వర్గాల కు న్యాయం జరిగే విధంగా చొరవ చూపాలని అన్నారు. కోర్టు భవనంలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేయాలన్నారు. నూతనం భవన నిర్మా ణం ప్రారంభోత్సవంకు వచ్చిన న్యాయమూర్తులకు కోరుట్ల బార్‌ అసోసి యేషన్‌ అద్వర్యంలో ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్ర మంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీపతి రావు, రాజేష్‌ ఖన్నా, తోట అంజనేయులు, చాప కిశోర్‌, బోయిని సత్యనారాయణ, కటకం రాజేంద్ర ప్రసాద్‌, మెట్‌పల్లి డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి, కోరుట్ల మెట్‌పల్లి సర్కిల్‌ పరి ఽధిలోని సీఐ, ఎస్‌ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

చట్టబద్ధమైన పాలనలో ముఖ్య పాత్ర

న్యాయవాదులదే

మెట్‌పల్లి: దేశంలో చట్టబద్ధమైన పాలన అదించడంలో న్యాయవాదు లది ముఖ్య పాత్ర కావాలని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ బుయాన్‌ అ న్నారు. మెట్‌పల్లి పట్టణంలోని సబ్‌ కోర్టులో నిర్మించిన సీనియర్‌ సివిల్‌, జడ్జి అసిస్టెంట్‌ స్పేషన్స్‌ కోర్టుల నూతన భవనాన్ని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జాల్‌ బుయాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నవీన్‌రావు, జువ్వా డి శ్రీదేవి, సంతోష్‌రెడ్డి, అనుపమ చక్రవర్తి, పుల్ల కార్తీక్‌లతో కలిసి శనివా రం ప్రారంభించారు. భవన ప్రారంభానికి వచ్చిన ప్రధాన న్యాయమూర్తు లను అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలకగా పోలీసులు చీఫ్‌ జస్టిస్‌కు గౌరవ వందనం సమర్పించారు. నూతన భవన అనంతరం కో ర్టు ఆవరణంలో కథాంబా మొక్కను నాటి నీటిని అందించారు. కోర్టు భవ నం ప్రారంభానికి వచ్చిన ప్రదాన న్యాయమూర్తులకు కోరుట్ల ఎమ్మెల్యే క ల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పుష్పగుచ్చం అందింది స్వాగతం పలికారు. అ నంతరం హైకోర్టు జడ్జిలు సంతోష్‌రెడ్డి, జువ్వాడి శ్రీదేవి కోరుట్ల, మెట్‌ప ల్లి కోర్టుల్లో పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. పని చేసిన చోట సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ బుయాన్‌ మాట్లాడుతూ నేర నిర్ధారణలో సాక్షులు ముఖ్యమైన వారు కాబట్టి వారిని ఇబ్బంది పెట్టకుం డా సాక్ష్యం స్వీకరించేంత వరకు వారికి రక్షణ కల్పించి ఇంటికి పంపాల న్నారు. ప్రతి కేసులో సాక్ష్యం ముఖ్యమైనది అది గుర్తించి వారి నుంచి సా క్ష్యం తీసుకున్న తరువాతే ఇంటికి వెళ్లడానికి అనుమతించాలన్నారు. న్యా యమూర్తిని అవుతానని ఎనాడూ అనుకోలేదన్నారు. న్యాయవాదులు అధి కారులను ఉపయోగించుకొని సమస్యలను పరిష్కరించాలని పలు సూచ నలు చేశారు. సమాజంలో మార్పు తీసుకరావడంలో జర్నలిస్టులది పా త్ర కీలకమైనదన్నారు. పత్రికల్లో రాసే కథనాలు సమాజంలోని సమస్యల ను పరిష్కరించేలా ఉన్నాయని జర్నలిస్టులను కొనియాడారు. ఈ కార్య క్ర మంలో ప్రిన్సిపాల్‌ జిల్లా జడ్జి నీలిమ, జిల్లా జడ్జి వీరయ్య, సీనియర్‌ సివి ల్‌ జడ్జి ప్రసాద్‌, జిల్లా కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా, ఎస్పీ భాస్కర్‌, ఆర్డీవో వి నోద్‌కుమార్‌, డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ లక్ష్మినారాయణ, బార్‌ అసోసియే షన్‌ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, ఉపాధ్యాక్షుడు ఎలుమల రాంబాబు, ప్రధాన కార్యదర్శి తెడ్డు ఆనంద్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:17:10+05:30 IST