CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొండగట్టు పర్యటన రేపటికి వాయిదా

ABN , First Publish Date - 2023-02-14T03:05:02+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జగిత్యాల జిల్లా కొండగట్టు పర్యటన మరుసటి రోజుకు వాయిదా పడింది. ముందుగా అనుకున్న మేరకు ఆయన ఈనెల 14వ తేదీన కొండ గట్టును సందర్శించాల్సి ఉంది.

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొండగట్టు పర్యటన రేపటికి వాయిదా

జగిత్యాల/హైదరాబాద్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ జగిత్యాల జిల్లా కొండగట్టు పర్యటన మరుసటి రోజుకు వాయిదా పడింది. ముందుగా అనుకున్న మేరకు ఆయన ఈనెల 14వ తేదీన కొండ గట్టును సందర్శించాల్సి ఉంది. అయితే కొండగట్టులో మంగళవారం రోజున భక్తుల సందడి ఎక్కువగా ఉండే అవకాశాలున్నందున సీఎం పర్యటన మరుసటి రోజుకు వాయిదా వేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి సర్కార్‌ వార్షిక బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో కొండగట్టు పర్యటనకు వెళ్లనున్న కేసీఆర్‌ క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా కోనేరు పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మ వారి కన్నీటిధార, బేతాళ స్వామి ఆలయంతో పాటు అక్కడి పలు ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఇటు సోమవారం సీఎంవో కార్యాలయ అధికారులు సీఎం పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు. 15వ తేదీన (బుధవారం) ఉదయం 9 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి సీఎం బయలుదేరి 9.05 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌ ద్వారా వెళ్లనున్నారు. ఉదయం 9.40 గంటలకు కొండగట్టు దేవస్థానానికి చేరుకుని ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. తర్వాత ఆలయ అభివృద్ధిని పరిశీలించిన అనంతరం జేఎన్టీయూ క్యాంప్‌సలోని కాన్ఫరెన్స్‌ హాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Updated Date - 2023-02-14T03:05:03+05:30 IST