క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకే సీఎం కప్‌

ABN , First Publish Date - 2023-05-26T00:16:50+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతి భను వెలికితీసేందుకే సీఎం కేసీఆర్‌ సీఎం కప్‌ పోటీలను నిర్వహిస్తు న్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకే సీఎం కప్‌
విజేతలకు బహుమతులు ప్రధానం ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌, మే 25 : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతి భను వెలికితీసేందుకే సీఎం కేసీఆర్‌ సీఎం కప్‌ పోటీలను నిర్వహిస్తు న్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం జగి త్యాల జిల్లా కేంద్రంలోని వివేకనందమినీ స్టేడియంలో సీఎం కప్‌ ముగిం పు పోటీల్లో ఎమ్మెల్యే పాల్గొని విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కప్‌ వి విధ పోటీల్లో 1200 మంది క్రీడాకారులు పాల్గొనగా 177 మంది క్రీడాకా రులు విజేతలుగా నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి క్రీడలు హైద్రాబాద్‌ లో ప్రారంభమవుతుతాయని, జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో విజేత లుగా నిలిచి జగిత్యాల పేరును నిలబెట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, గ్రామాన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిందన్నారు. జగిత్యాల ప ట్ణణంలో 15 క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌జిమ్‌లు ఏర్పాటు చేసినట్లు పే ర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో ఇండోర్‌ స్టేడియం అభివృ ద్ధికి రూ.35లక్షలు మంజూరు చేయడం అభినందనీయనమన్నారు. ఎస్‌ కెఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలకు అత్యాధునిక రన్నింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్ల పోలీస్‌ ఉద్యోగాలకు పోటీపడే వారికి సరైన రన్నింగ్‌ ట్రాక్‌ లేక ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్య క్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు పెద్దపీట వేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ మంద మకరందు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, కమిషనర్‌ నరేష్‌, జిల్లా రైతుబంధుసమితి అధ్యక్షుడు వెంకట్‌రావు, జిల్లా అధికారులు సాయిబాబా, రాజ్‌కుమార్‌, నాయకులు అనిల్‌, శ్రీనివాస్‌, డీఈ రాజేశ్వర్‌రెడ్డి, పీఈటీలు వినీత్‌, అజయ్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:17:29+05:30 IST