‘మిషన్‌ భగీరథ’తో పల్లెలకు శుద్ధమైన తాగునీరు

ABN , First Publish Date - 2023-06-18T23:36:26+05:30 IST

రాష్ట్రంలో మిషన్‌ భగీరథ పథకంతో ప్రతి పల్లెకు శుద్ధమైన తాగునీరు అందుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

‘మిషన్‌ భగీరథ’తో పల్లెలకు శుద్ధమైన తాగునీరు

కరీంనగర్‌ రూరల్‌, జూన్‌ 18: రాష్ట్రంలో మిషన్‌ భగీరథ పథకంతో ప్రతి పల్లెకు శుద్ధమైన తాగునీరు అందుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం కొత్తపల్లి మండలం ఎలగందల్‌ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాశ్వతంగా నీటి కష్టాలను తొలగించేందుకు 2015లో రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు, మున్సిపాలిటీలలో 135 లీటర్లు, కార్పోరేషన్‌ పరిధిలో 150 లీటర్ల నీటిని ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మిషన్‌ భగీరథ చీఫ్‌ ఇంజనీర్‌ అమరేందర్‌, ఈఈ రామ్‌కుమార్‌, డీఏవో నాగ సిద్దేశ్వర్‌, ఎంపీపీలు పిల్లి శ్రీలతమహేష్‌, తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ రుద్రరాజు, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రెడ్డవేణి మధు, సర్పంచ్‌ ఎల్దండి షర్మిల, ఎంపిటీసీ మంద రమేష్‌ పాల్గొన్నారు

- కొత్తపల్లి మండలం ఎలగందల్‌ గ్రామంలో మంచినీళ్ల పండుగను ముందుగా అనుకున్న ప్రకారంఉదయం 10.30 నిమిషాలకు నిర్వహించాల్సి ఉంది. మంత్రి గంగుల కమలాకర్‌ హైదరాబాద్‌ నుండి కార్యక్రమానికి రావడం ఆలస్యం కావడంతో ్లకలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ ఎలగందల్‌ గ్రామానికి చేరుకున్నారు. బహిరంగ సభ కార్యక్రమాని కంటే ముందుగానే కలెక్టర్‌ ఎలగందల్‌ గ్రామంలోని మిషన్‌ భగీరథ పిల్టర్‌ బెడ్‌లను పరిశీలించి వెళ్లిపోయారు.

-అభివృద్ధి పనులు ప్రారంభం

కరీంనగర్‌ టౌన్‌: నగరంలోని 16వ డివిజన్‌లో సీసీ రోడ్డు, పైపులైను, ఇతర అభివృద్ధి పనులను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ నాణ్యతాప్రమాణాలను పాటిస్తూ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, డివిజన్‌ కార్పొరేటర్‌ బోనాల శ్రీకాంత్‌, కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, ఎస్‌ఈ నాగమల్లేశ్వర్‌రావు, ఈఈలు మహేందర్‌, కిష్టప్ప, డీఈ వెంకటేశం, ఏఈ చైతన్య పాల్గొన్నారు.

Updated Date - 2023-06-18T23:36:26+05:30 IST