Share News

మార్కెట్‌లో క్రిస్మస్‌ సందడి

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:39 PM

ఈ నెల 25న క్రిస్మస్‌ సందర్భంగా మార్కెట్‌లో పలు వస్తువులు సందడి చేస్తున్నాయి. కాంతులీనే విద్యుత్‌ బల్బులు, అలంకరణ సామగ్రి కనువిందు చేస్తున్నాయి.

మార్కెట్‌లో క్రిస్మస్‌ సందడి

కరీంనగర్‌ కల్చరల్‌, డిసెంబరు 18: ఈ నెల 25న క్రిస్మస్‌ సందర్భంగా మార్కెట్‌లో పలు వస్తువులు సందడి చేస్తున్నాయి. కాంతులీనే విద్యుత్‌ బల్బులు, అలంకరణ సామగ్రి కనువిందు చేస్తున్నాయి. క్రైస్తవులు వివిధ వస్తువులను కొనుగోలు చేసి గృహాలను అలంకరించుకోవడంలో నిమగ్నమవుతున్నారు. వివిధ రకాల నక్షత్రాలు రూ. 10ల నుంచి రూ. 500లు పలుకుతుండగా, క్రిస్‌మస్‌ ట్రీలు రూ. 35ల నుంచి రూ. 2500ల వరకు పలుకుతున్నాయి. క్రిస్మస్‌ శుభా కాంక్షలతో కూడిన తోరణాలు 25 రూపాయల నుంచి 100 రూపాయల వరకు అమ్ముతున్నారు. రంగుల డెకరేషన్‌ వస్తువులు రూ. 75 నుంచి రూ. 1000 వరకు దొరుకుతున్నాయి. క్రిస్మస్‌ తాత డ్రెస్‌ రూ. 275 నుంచి రూ. 750ల వరకు విక్రయిస్తున్నారు. క్రీస్తు ఫొటోలు 15 రూపాయల నుంచి రూ. 250ల వరకు అమ్ముతున్నారు. క్రిస్మస్‌ తాతల రూపాలను రూ. 40 నుంచి రూ. 500 వరకు విక్రయిస్తున్నారు. రక రకాల గి్‌ఫ్ట్‌లను రూ. 50 లనుంచి రూ. 500ల వరకు అమ్ముతున్నారు. వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతుండగా ధర లు పెరిగినా కొనడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. గిరాకీ కూడా బా గుందని వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:39 PM