Share News

చొప్పదండిని మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

ABN , First Publish Date - 2023-12-11T00:10:15+05:30 IST

చొప్పదండిని రాష్ట్రంలోనే మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దు తానని నియోజకవర్గ నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన మేడిపల్లి సత్యం అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం ఆదివారం తొలి సారిగా కొండగట్టుకు వచ్చిన సత్యం ఆంజనేయస్వామి ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.

చొప్పదండిని మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
కొండగట్టు ఆలయంలో మేడిపల్లి సత్యం

- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

- అంజన్న సన్నిధిలో పూజలు

మల్యాల, డిసెంబరు 10: చొప్పదండిని రాష్ట్రంలోనే మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దు తానని నియోజకవర్గ నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన మేడిపల్లి సత్యం అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం ఆదివారం తొలి సారిగా కొండగట్టుకు వచ్చిన సత్యం ఆంజనేయస్వామి ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో గత ఎన్నికల ముందు తన గెలుపు కోసం స్వామి వారికి కట్టిన ముడుపు విప్పారు. ఈ సంద ర్భంగా సత్యంను ఏఈవో శ్రీనివాస్‌ శాలువతో సత్కరించగా అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో దొంగ ఆనందరెడ్డి, దారం ఆదిరెడ్డి, ముత్యం శంకర్‌గౌడ్‌, వెల్మ లక్ష్మారెడ్డి, సతీష్‌రెడ్డి, శ్రీకోటి శ్రీకాంత్‌, బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, ఆగంతపు వంశీధర్‌, కట్కం వినయ్‌, లక్ష్మణాచారి, నరసింహరెడ్డి, హరినాథ్‌, నక్క అనిల్‌, రవీందర్‌, లక్ష్మన్‌పాల్గొన్నారు. కాగ యువజన కాంగ్రెస్‌ మండల శాఖ మాజీ అఽధ్యక్షుడు కంచర్ల లక్ష్మణాచారి ఎమ్మెల్యేగా సత్యం విజయం సాధించడంతో 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు. ఎమ్మెల్యే కూడా కొబ్బరికాయలు కొట్టారు.

కొండగట్టుపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిందని ఎమ్మెల్యే సత్యం అన్నారు. తమ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆరు నెలల క్రితమే కొండగట్టు వచ్చారని సీఎం సహకారంతో ఈ క్షేత్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించి నియోజకవర్గానికి మొదటిసారి వచ్చిన మేడిపల్లి సత్యంకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. బల్వంతాపూర్‌ స్టేజి నుంచి కొండగట్టు వరకు భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో పాటు పలువురు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంపై అభినందనలు తెలిపారు.

Updated Date - 2023-12-11T00:10:23+05:30 IST