కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ABN , First Publish Date - 2023-05-26T00:22:26+05:30 IST
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు.

వేములవాడ, మే 25: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. గురువారం వేములవాడలో నిర్వహించిన పార్టీ పట్టణ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా చేపట్టనున్న మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ప్రజా సంక్షేమ పథకాలను కరపత్రాల రూపంలో గడపగడపకు తీసుకువెళ్లాన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదా రులతో సమ్మేళనం, మేధావుల సమ్మేళనం, యువ సమ్మే ళనం వంటివి నిర్వహిస్తామన్నారు. నాయకులు రేగుల సంతోష్‌బాబు, మల్లికార్జున్, అంజి బాబు, ముప్పిడి శ్రీనివాస్, గజ్జెల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.