కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
ABN , First Publish Date - 2023-12-04T01:51:30+05:30 IST
రామగుండం ఎమ్మెల్యేగా మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ గెలుపొందగా ఆదివారం రాత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
కోల్‌సిటీ, నవంబరు 3: రామగుండం ఎమ్మెల్యేగా మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ గెలుపొందగా ఆదివారం రాత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మెయిన్ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ, రాష్ట్ర నాయకులు రామగుండం వైపుచూస్తున్నారని, రామగుండం ప్రజలకు రాజ్‌ఠాకూర్‌పై ఎందుకింత ప్రేమ అని ఆలోచిస్తున్నారన్నారు. ఈ ఘనత ప్రజలదేనన్నారు.
మంథని, డిసెంబరు 3: అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు భారీ మెజార్టీతో గెలుపొందడంపై కాంగ్రెస్ నాయకులు ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రమైన మంథని పట్టణంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై శ్రీధర్‌బాబుకు ఘనంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
మంథని రూరల్, రామగిరి, ముత్తారం : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎమ్మెల్యేగా గెలుపొందడంపై కాంగ్రెస్ నాయకులు ఆదివారం సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంపిణీ చేస్తూ, బాణసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో అపశృతి
మంథనిరూరల్ : మంథని మండలంలోని గుంజపడుగులో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాల్లో ఆదివారం అపశృతి చోటుచేసుకుంది. గుంజపడుగు ప్రధాన చౌరస్తాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ట్రాక్టర్ ఇంజన్లతో రౌండ్స్ కొడుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ గుర్ర సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం సతీష్‌ను కరీంనగర్‌కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
పెద్దపల్లి రూరల్, ఓదెల, సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, ఎలిగేడు, జూలపల్లి, డిసెంబరు 3 : పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతకుంట విజయరమణారావు గెలుపొందడంపై ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.
యైుటింక్లయిన్‌కాలనీ, పాలకుర్తి, అంతర్గాం, డిసెంబరు 3 : రామగుం డం ఎమ్మెల్యేగా మక్కాన్ సింగ్ గెలుపొందడంపై కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.