మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-02-17T23:53:23+05:30 IST

గ్రామాల్లో నాటిన మొక్కలు వెస వికి ఎండి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డీవో వినోద్‌కుమార్‌ అధికారులకు సూచించారు.

మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
చౌలమద్దిలోని నర్సరీని పరిశీలిస్తున్న ఆర్డీవో వినోద్‌కుమార్‌

మెట్‌పల్లి రూరల్‌, ఫిబ్రవరి 17 : గ్రామాల్లో నాటిన మొక్కలు వెస వికి ఎండి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డీవో వినోద్‌కుమార్‌ అధికారులకు సూచించారు. మండలంలోని చౌలమద్ది గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీ, పాఠశాల, గ్రామపంచాయతీ కార్యాలయంలోని రి కార్డులను ఎంపీడీవో భీమెశ్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. జాతీయ రో డ్డుకు ఇరువైపుల మొక్కలు, పల్లె ప్రకృతి వనంలోని మొక్కలు వెసవి కాలంలో ఎండి పోకుండా ఎప్పటికికప్పుడు నీరును పో స్తుండాలని, న ర్సరీలో పలు రకాల మొక్కలు పెంచాలని, పంచాయతీ కార్యాలయంలో రికార్డులు ఎప్పటికికప్పుడు నమోదు చేయాలని పలు సూచనలు చేశా రు. అనంతరం చింతలపేటలోని కంటి వెలుగు శిబి రాన్ని పరిశీలించి కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందు లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి పలు సూచనలు చే శారు. ఈయన వెంట సర్పంచు గడ్డం లింగారెడ్డి, ఎంపీవో మహేశ్వర్‌ రెడ్డి, పంచాయాతీ కార్యదర్శి రవినాయక్‌, కారోబార్‌ వాసల రాములు, ఉపాధిహామీ సిబ్బంది, పాల్గొన్నారు.

Updated Date - 2023-02-17T23:53:26+05:30 IST