వర్షాల వల్ల నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి

ABN , First Publish Date - 2023-07-22T00:38:47+05:30 IST

జిల్లా వ్యాప్తంగా నాలుగు రో జులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్థి న ష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల ను జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌ ఆదేశించారు.

వర్షాల వల్ల నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌

జగిత్యాల, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా నాలుగు రో జులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్థి న ష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల ను జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌ ఆదేశించారు. శుక్రవారం పట్ట ణంలోని జడ్పీ క్యాంపు కార్యాలయం నుంచి పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో జూమ్‌ యాప్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ ని ర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడారు. ప్రమాదాలు జర గకముందే వాగులు, వంకలు, చెరువులు, బ్రిడ్జీల వద్ద హెచ్చరిక బో ర్డులు ఏర్పాటు చేసి నివారించాలని సూచించారు. విద్యుత్‌ స్తంభాలు, తెగిన వైర్లు, నీటి ప్రవాహాల వద్ద ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిం చే విధంగా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, నీటి ప్ర వాహ ప్రాంతాల వద్దకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలన్నా రు. ఎంపీడీవోలు, రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగం, స్థాని క ప్రజాప్రతినిధుల సహాయం తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా చూడాలన్నారు. ప్రజలు అత్యవసరమైతే మినహా బయటకు రావద్దని సూచించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా హెల్త్‌, శానిటేషన్‌ విభాగాలు కలిసి పనిచేయాలని సూచించారు. దో మల నివారణకు సంబంధించి ఫాగింగ్‌ వంటి కార్యక్రమాలను ని ర్వహించాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి ప్రజల ను అప్రమత్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రా మానుజాచార్యులు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సత్యనారాయణ, ఇరిగేషన్‌ ఎస్‌ ఈ అశోక్‌ కుమార్‌, డీపీవో దేవరాజం, పలు మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-22T00:38:47+05:30 IST