బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర భవిష్యత్
ABN , First Publish Date - 2023-03-05T00:41:17+05:30 IST
సమైక్య పాలన లో రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసిన వారు పాద యాత్రలతో మోసం చేసేందుకు వస్తున్నారని, అలాంటి వాళ్లను నమ్మవద్దని, బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని మంత్రి గంగుల కమలాకర్ అన్నా రు.
పెద్దపల్లి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): సమైక్య పాలన లో రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసిన వారు పాద యాత్రలతో మోసం చేసేందుకు వస్తున్నారని, అలాంటి వాళ్లను నమ్మవద్దని, బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని మంత్రి గంగుల కమలాకర్ అన్నా రు. శాసనమండలి చీఫ్‌విప్ తానిపర్తి భానుప్రసాదరా వు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. పెద్దపల్లి ఎంబీ గార్డెన్‌లో నిర్వహించిన ఆత్మీ య సన్మాన సభలో గజమాలలతో ఘనంగా సన్మానిం చారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడు తూ 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి 2014 వరకు రైతులకు సాగు నీరందించేందుకు ఇబ్బందులు పడ్డామన్నారు. పెద్దపల్లి జిల్లాకు నీరిందించి డి-83, డి- 86ద్వారా కాలువ నీళ్లు వచ్చేవి కావని, పంటలన్నీ ఎండిపోయి రైతు లు అధోగతి పాలయ్యారన్నారు. నీళ్లు లేక, కరెంట్ లేక, మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి, మద్దతు ధరలు దక్కక అప్పులపాలై అనే క మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. అసెం బ్లీకి ఎండిపోయిన వరి మొక్కలు,కాలిపోయిన మోటార్లతో వెళ్లి నిర సన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో మార్పు రాలేదన్నారు. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కష్టాలు తీరా యన్నారు. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. నాడు రాష్ట్రంలో 14 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే, ఇప్పుడు కోటి టన్నుల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారని వివరించారు. నాడు, నేడు ఎక్కడ కూడా భూమి పెరగలేదని, సీఎం కేసీఆర్ కృషి వల్లనే ఇదంతా సాధ్యమైం దనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఒకప్పుడు ఎమ్మెల్యేలు ప్ర జల్లో ఉండేవారు కాదని, ఇప్పుడు 24 గంటలు మంత్రులు, ఎమ్మెల్యే లు ప్రజల్లోనే ఉంటున్నారన్నారు. సంపదను సృష్టించాలి, పేదలకు పంచాలనే ధ్యేయంతో సీఎం పనిచేస్తున్నారన్నారు. తెలంగాణలో సంపద పెరగడంతో ఆ సంపదనంతా దోచుకునేందుకు మోసగాళ్లు పాదయాత్రల పేరిట మీ ముందుకు వస్తున్నారని, అలాంటి వారిని నమ్మవద్దని సూచించారు. పోలింగ్ బూతు వద్దకు వెళితే కేసీఆరే గుర్తుకు రావాలన్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక స్థానాన్ని కోల్పోయామని, ఈసారి అలా జరగవద్దని 13కు 13 స్థానాల్లో గెలిచి తీరాలని, అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
పార్టీ బలోపేతం కోసం పనిచేస్తేనే గుర్తింపు
చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాదరావు
పార్టీ బలోపేతం కోసం నిబద్ధతతతో పనిచేస్తేనే గుర్తింపు లభి స్తుందని, అందరికీ అవకాశాలు వస్తాయని శాసన మండలి చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాదరావు అన్నారు.మూడుసార్లు ఎమ్మెల్సీగా గెలుపొందిన తనకు సీఎం కేసీఆర్ మండలి చీఫ్ పదవి కట్టబెట్టడా న్ని మరచిపోలేనని అన్నారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు పార్టీ ఏ బాధ్యత అప్పగిం చినా నిబద్ధతతో పని చేస్తానని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా నన్నారు. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనని పలుసార్లు ఎ మ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి చెప్పానని గుర్తుచేశారు. వచ్చే ఎన్నిక ల్లో దాసరి మనోహర్‌రెడ్డికి గానీ, ఇంకా ఎవరికైనా టిక్కెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం కృషిచేస్తానని అన్నారు. ఎమ్మెల్యే కావాలనే ఆశ, కోరిక ఉండడంలో తప్పులేదని, కానీ కొన్ని పరిమితులు ఉంటాయ ని, పార్టీ నిర్ధేశించిన లక్ష్యాలతో ముందుకుపోవాలన్నారు. పార్టీ అధి ష్టానం సమయానుకూలంగా, అప్పటి సమీకరణాలను బట్టి పద వులు, టిక్కెట్లు ఇస్తుందని, రానివాళ్లు నిరాశకు గురికాకుండా పార్టీ గెలుపు కోసం, బలోపేతం కోసం పని చేయాలన్నారు. అంతకుముం దు పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దారన్నారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడుతూ ఈ జిల్లాకు భానుప్రసాద రావు కొండంత అండ అని అన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే టిక్కెట్ కావాలంటూ పెద్దపల్లి నుంచి కూడా 20 మంది లైన్లో నిల్చున్నారని, వారందరిని నిలువరించాలని అన్నారు. అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావు, రామగుండం మేయర్ డాక్ట ర్ బంగి అనిల్ కుమార్, జడ్పీ వైస్ చైర్‌పర్సన్ మండిగ రేణుక, ము న్సిపల్ చైర్మన్ డాక్టర్ మమతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, జడ్పీటీసీలు బొద్దుల లక్ష్మన్, బండారి రామ్మూర్తి, ఎంపీపీలు, సివిల్ సప్లయ్ మెంబర్ పడాల సతీష్, పార్టీ నాయకు లు ఉప్పు రాజు కుమార్, రేగుంట అశోక్ గౌడ్, పురుషోత్తం, తది తరులు పాల్గొన్నారు.