దళితుల సంక్షేమానికి బీఆర్‌ఎస్ చేసిందేమి లేదు
ABN , First Publish Date - 2023-11-20T22:52:07+05:30 IST
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమానికి చేసిందే మి లేదని పెద్దపల్లి నియోజకవర్గ బీ ఎస్పీ అభ్యర్థి దాసరి ఉష అన్నారు.

పెద్దపల్లి, నవంబరు 20 (ఆంధ్ర జ్యోతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమానికి చేసిందే మి లేదని పెద్దపల్లి నియోజకవర్గ బీ ఎస్పీ అభ్యర్థి దాసరి ఉష అన్నారు. పె ద్దపల్లి పట్టణంలోని 8వ వార్డులో ఆమె ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ బీ ఎస్పీ మెనిఫెస్టో గురించి వివరించారు. అనంతరం ఆమె ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వా త దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇ స్తానన్న కేసీఆర్ ఆ హామీలను నెరవేర్చలేదని అన్నారు. దళి తబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రెండేళ్లు కావస్తున్నా కూడా నియోజకవర్గానికి 100 యూనిట్లకు మించి ఇవ్వలేదన్నారు. డబుల్ బెడ్ రూముల ఇళ్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. అక్కడక్కడ పూర్తయిన ఇళ్లకు లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఏడాది గడుస్తున్నా కూడా ఇళ్ల తాళాలు ఇవ్వ డంలేదన్నారు. జిల్లాకేంద్రంలో దళిత విద్యార్థులు, నిరుద్యో గులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటుచేస్తామన్న డాక్ట ర్ అంబేద్కర్ భవనానికి దిక్కేలేదన్నారు. పెద్దపల్లి పట్టణం లో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని, ఎక్కడ చూ సినా మురికి కూపాలేనని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రె స్ పార్టీలు అగ్రవర్ణ పార్టీలేనని, వాళ్లు బీసీలకు టిక్కెట్లు అధికంగా ఇవ్వరన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు ఓసీలకే టిక్కెట్లు ఇచ్చిందన్నారు. దళిత, గిరిజన, బీసీ, మైనార్టీల కోసం ఆలోచన చేసేదే బహుజన సమాజ్ పార్టీ అని అన్నారు. నియోజకవర్గంలో బీఎస్పీకి ఆదరణ పెరుగుతున్నదని, బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధి కారం సిద్ధిస్తుందని తెలిపారు. తనను ఆశీర్వదించి ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని దాసరి ఉష ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.