ఓటరు జాబితా తయారీలో బీఎల్‌వోలదే కీలక పాత్ర

ABN , First Publish Date - 2023-07-21T00:23:58+05:30 IST

ఓటరు జాబితా నవీకరణ, సవరణలో బూత్‌ స్థాయి అధికారులదే(బీఎల్‌వో) కీలక పాత్ర అని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్‌ గెస్ట్‌హౌజ్‌లో సిరిసిల్ల బూత్‌ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లకు అసెంబ్లీ లెవల్‌ మాస్టర్‌ ట్రెయినర్స్‌(ఏఎల్‌ఎంటీ) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు

ఓటరు జాబితా తయారీలో బీఎల్‌వోలదే కీలక పాత్ర
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా నవీకరణ, సవరణలో బూత్‌ స్థాయి అధికారులదే(బీఎల్‌వో) కీలక పాత్ర అని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్‌ గెస్ట్‌హౌజ్‌లో సిరిసిల్ల బూత్‌ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లకు అసెంబ్లీ లెవల్‌ మాస్టర్‌ ట్రెయినర్స్‌(ఏఎల్‌ఎంటీ) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిష్పాక్షపాతంగా నిర్వహించడానికి తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించుకోవడం చాలా అవసరమని అన్నారు. ఇందుకు బూత్‌స్థాయిలో బీఎల్‌వోలది కీలక పాత్ర ఉంటుందని ఇంటింటికి తిరిగి పూర్తి వివరాలు, అధారాలను సేకరించాలని అన్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలన్నారు. ప్రస్తుతం రెండో రివిజన్‌ ప్రకారం నూతనంగా వచ్చిన నిబంధనలు, మార్పులు, సడలింపులపై బీఎల్‌వోలు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. 6, 7, 8, ఫాంలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. నియోజకవర్గ ట్రెయినర్లకు ఇచ్చే శిక్షణ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, ఏమైనా అనుమానాలు ఉంటే ట్రెయినర్‌ను అడిగి తెలుసుకోవాలని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T00:23:58+05:30 IST