రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి
ABN , First Publish Date - 2023-08-22T01:21:30+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని గుల్బర్గా(కర్ణాటక) ఎమ్మెల్సీ బీ.జి పాటిల్ పి లుపునిచ్చారు.
అసెంబ్లీ ప్రవాస్ యోజన సమావేశంలో ఎమ్మెల్సీ పాటిల్
జగిత్యాల అర్బన్, ఆగష్టు 21: తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని గుల్బర్గా(కర్ణాటక) ఎమ్మెల్సీ బీ.జి పాటిల్ పి లుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఓ ప్రైవేట్ బంకెట్ హాల్‌లో బీజేపీ చే పట్టిన నియోజకవర్గ స్థాయి ప్రవాస్ యోజనలో భాగంగా గుల్బర్గా(కర్ణాటక) ఎ మ్మెల్సీ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్థానిక స్థితిగతులను తెలుసుకోవడానికి బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించిందన్నారు. రానున్న ఎ న్నికల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాల న్నా రు. బూత్ స్థాయి నుంచి మొదలై రాష్ట్రంలో బీజేపీ జెండాను ఎగరవేయా లని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదా శి వం, జిల్లా కార్యదర్శి రాగ్లిల సత్యనారాయణ, బీజేపీ నియోజకవర్గ బాధ్యులు మదన్‌మోహన్, బోగ శ్రావణి, పన్నాల తిరుపతిరెడ్డి, డాక్టర్ శైలేంధర్‌రెడ్డి, పడా ల తిరుపతి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనుమల్ల కృష్ణహరితో పాటు వివిధ మం డలాల పధాధికారులు, నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ బాధ్యులలో ఒ కరైన దంతవైద్య నిపుణులు, సీనియర్ నాయకులు డాక్టర్ ఎడమల శైలేంధర్ రెడ్డి పాటిల్‌కు అర్థమయ్యేలా, కన్నడ భాషలో మాట్లాడి, స్థానిక పరిస్థితులను, పార్టీ విధివిధానాలను వివరించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి
కోరుట్ల రూరల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలను ప్రజలోకి తీసుకపోయి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతి కార్యకర్త కృషి చేయా లని యావత్మాల్ ఎమ్మెల్యే మదన్ ఎరావార్ అన్నారు. సోమవారం మండ లం లోని పైడిమడుగు గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్, సాంబారి ప్రభాకర్, నియోజకవర్గ నాయకురాలు సునిత-వెంకట్‌ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రవాస్‌యెజనా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యకర్తల స మావేశంలో ఎమ్మెల్యే మదన్ ఎరావార్ ముఖ్య అతిగా పాల్గొన్ని మాట్లాడారు. ఎమ్మెల్యే మదన్ ఎరావార్‌కు కార్యకర్తలు ఘన స్వాగతం ఫలికారు. ఈ కార్య క్ర మంలో యూసుఫ్‌నగర్ సర్పంచ్ తుక్కారాం గౌడ్, మండల అధ్యక్షుడు చిన్న మెట్‌పల్లి ఎంపీటీసీ సభ్యుడు పంచరి విజయ్ కుమార్‌లతో పాటు బీజేపీ నా యకులు పాల్గొన్నారు.
కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి
పెగడపల్లి: అవినీతి , కుటుంబ పాలన రాజకీయాలకు చరమగీతం పాడా లని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఖుషినగర్ ఎమ్మెల్యే పి.ఎన్.పాఠక్ పిలుపునిచ్చారు. ఎ మ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో బాగంగా సోమవారం పెగడపల్లి మం డల కేంద్రంలో బీజేపీ మండల స్థాయిలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పి.ఎన్.పాఠక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జాతీయ వాద సిద్దాంతాలతో దేశ అభివృద్ధే ధ్యేయంగా బడుగు బల హీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేవిధంగా భారతీయ జనతాపార్టీ పాలన కొనసాగుతుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారా యణ రావు, మండల అధ్యక్షుడు గంగుల కొమురెల్లి, ధర్మపురి అసెంబ్లీ కన్వీనర్ కస్తూరి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చింతకింది అనసూర్య, జిల్లా అధి కార ప్రతినిథి మర్రిపెల్లి సత్యం, నాయకులు రాజేష్, రవీందర్ రెడ్డి, సాయికృష్ణ, సతీష్, గంగాధర్, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.