భగ్గుమన్న భానుడు

ABN , First Publish Date - 2023-06-03T00:30:04+05:30 IST

: రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలే ఉంటాయన్నట్లుగానే శుక్రవారం ఎండలు భగ్గుమన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

భగ్గుమన్న భానుడు
జన సంచారం లేక వెలవెలబోతున్న వెంకటేశ్వర టెంపుల్‌ రోడ్‌

- రుద్రంగిలో 44.8 గరిష్ఠ ఉష్ణోగ్రత

సిరిసిల్ల, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలే ఉంటాయన్నట్లుగానే శుక్రవారం ఎండలు భగ్గుమన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అధిక ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. రుద్రంగి మండల కేంద్రంలో అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రత 44.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీలుగా నమోదైంది. కోనరావుపేట మండలం మర్తనపేట, సిరిసిల్లలో గరిష్ట ఉష్ణోగ్రత 44.7, వేములవాడ రూరల్‌ మండలం వట్టెంలలో 44.4, తంగళ్లపల్లి మండలం నేరేళ్ల, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో 44.0, వీర్నపల్లిలో 43.9, చందుర్తి మండలం మర్రిగడ్డలో 42.9, గంభీరావుపేట మండలం గజసింగవరంలో 42.8, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం, వేములవాడ మండలం నాంపల్లిలో 42.3, ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌, కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో 42.0 డిగ్రీలుగా నమోదైంది.

Updated Date - 2023-06-03T00:30:04+05:30 IST