బాల సదనం ప్రారంభం
ABN , First Publish Date - 2023-11-14T23:06:44+05:30 IST
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లిలోని పెద్దకల్వల ప్రాంతంలో ఏర్పాటు చేసిన బాల సదనంను మంగళవారం ప్రారంభించారు.
పెద్దపల్లి రూరల్, నవంబరు 14: జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లిలోని పెద్దకల్వల ప్రాంతంలో ఏర్పాటు చేసిన బాల సదనంను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలల దినోత్సవం నాడు బాల సదనం ప్రారంభించడం సంతోషకరమని, ఇందులో అనాథలు, పాక్షిక ఆనాథ లకు, రక్షణ, సంరక్షణ అవసరమైన 6 నుంచి 14 సంవత్సరాలలోపు ఆడపి ల్లలకు వసతి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు దోహదపడే విధంగా అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని, అన్ని ఆటలు కూడా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సంబం ధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్ష్షేమ అధికారి రౌఫ్ ఖాన్, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ సుగుణ, సీడీపీఓ పెద్దపల్లి కవిత, సిడిపిఓ మంథని పద్మ, డిసిపిఓ కమలాకర్ , చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.