Share News

ఓట్ల లెక్కింపునకు సిద్ధంగా ఉండాలి

ABN , First Publish Date - 2023-11-20T23:43:03+05:30 IST

ఓట్ల లెక్కింపునకు ఎస్సారార్‌ కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల పోలీస్‌ అబ్జర్వర్‌ ఎ సతీష్‌ గణేష్‌ సూచించారు. సోమవారం ఎస్సారార్‌ కళాశాలను ఆయన పరిశీలించారు.

ఓట్ల లెక్కింపునకు సిద్ధంగా ఉండాలి
కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు

- కేంద్ర ఎన్నికల పోలీస్‌ అబ్జర్వర్‌ ఎ సతీష్‌ గణేష్‌

కరీంనగర్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఓట్ల లెక్కింపునకు ఎస్సారార్‌ కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల పోలీస్‌ అబ్జర్వర్‌ ఎ సతీష్‌ గణేష్‌ సూచించారు. సోమవారం ఎస్సారార్‌ కళాశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ పార్టీల ప్రతినిధులు కౌంటింగ్‌ కేంద్రంలోనికి ప్రవేశించడానికి నియోజకవర్గం వారీగా వేర్వేరు ప్రవేశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్‌ కేంద్రంలో పనిచేసే సిబ్బంది అందరికి ఫోటో గుర్తింపు కార్డులు అందజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి, చొప్పదండి, కరీంనగర్‌ రిటర్నింగ్‌ అధికారులు ప్రపుల్‌ దేశాయ్‌, కే మహేశ్వర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T23:43:07+05:30 IST