‘బీసీ బంధు’ ప్రకటించాలి

ABN , First Publish Date - 2023-01-30T00:09:26+05:30 IST

అన్ని వర్గాల సంక్షేమానికిపాటు పడుతున్న ప్రభుత్వం బీసీలకు బీసీ బంధును ప్రకటించాలని, కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణనను వెంటనే చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు డిమాండ్‌ చేశారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం ఆవరణలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సెస్‌ డైరెక్టర్‌ మల్లేశంను ఆదివారం సన్మానించారు.

 ‘బీసీ బంధు’ ప్రకటించాలి
సన్మానిస్తున్న పర్శ హన్మండ్లు

వీర్నపల్లి, జనవరి 29 : అన్ని వర్గాల సంక్షేమానికిపాటు పడుతున్న ప్రభుత్వం బీసీలకు బీసీ బంధును ప్రకటించాలని, కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణనను వెంటనే చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు డిమాండ్‌ చేశారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం ఆవరణలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సెస్‌ డైరెక్టర్‌ మల్లేశంను ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా హన్మండ్లు మాట్లాడుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వీర్నపల్లి మండలాన్ని మంత్రి కేటీఆర్‌ చొరవతో అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలుపుతున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల అభ్యున్నతికిపాటు పడుతున్నారని అన్నారు. 10 శాతం జనాభా ఉన్న అగ్ర వర్ణాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్న ప్రభుత్వాలు 54 శాతం ఉన్న బీసీలకు అంతే స్థాయిలో రిజర్వేషన్లు కల్పించకపోవడం శోచనీయమన్నారు. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారు. కులగణన చేపట్టి న్యాయబద్దంగా దక్కాల్సిన హక్కులను కల్పించాలని డిమాండ్‌ చేశారు. జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణికి జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆమెకు బీసీ సంక్షేమ సంఘం అండగా నిలుస్తుందన్నారు. బీసీలపై దాడులు, అవమానాలు జరిగితే సహించబోమని హెచ్చరించారు. నాయకులు బాల్‌రెడ్డి, రమేశ్‌, రాజు, లింగం, దేవరాజు, పృథ్వీ, దేవయ్య, శేఖర్‌, రాజేశం, ముత్యం, శివరామకృష్ణ, శ్రీనివాస్‌, రవి, అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-30T00:10:04+05:30 IST