దళితబంధు తరహాలో బీసీ బంధు

ABN , First Publish Date - 2023-06-09T23:40:19+05:30 IST

దళిత బంధు తరహాలో బీసీ బంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయి నపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు.

దళితబంధు తరహాలో బీసీ బంధు
వేములవాడలో మాట్లాడుతున్న వినోద్‌కుమార్‌

సిరిసిల్ల (ఆంధ్రజ్యోతి)/వేములవాడ, జూన్‌ 9: దళిత బంధు తరహాలో బీసీ బంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయి నపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్స వాల్లో భాగంగా వేములవాడ పట్టణంలో శుక్రవారం నిర్వ హించిన సంక్షేమ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణలో దశా బ్ది ఉత్సవాలు గౌరవంగా నిర్వహిస్తున్నామని, వచ్చే దశాబ్ది వరకు జరిగే అభివృద్ధి ప్రణాళికలు వేసుకుంటామని అన్నారు. సంక్షేమ పథకాల కోసం అప్పు చేయలేదని, కరెంట్‌, సాగునీరు కోసమే అప్పు చేశామని వాటి ద్వారా రైతులు, ప్రజల ఉత్పత్తి పెరిగి, తద్వారా వార్షిక ఆదా యం పెరిగిందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయక ముందు 2001లో గులాబీ జెండా పుట్టినప్పుడే దళిత బంధు పథకం గురించి ఆలోచన చేశామని, ఇపుడు ఆచ రణలో పెడుతున్నామని అన్నారు. రైతుబంధు సన్న, చిన్నకారు రైతుల కోసమేనని, నాడు పేదల దగ్గర భూమి లేని పరిస్థితి కానీ ఇపుడు సన్న, చిన్నకారు రైతులు చాలా ఉన్నారని, వారికి పెట్టుబడి పెట్టుకొనే స్థోమత లేనందున ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టితో ఆలోచన చేసి పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 10 వేల రూపాయలు ఇవ్వాలని రైతుబంధు పథకం తీసుకొచ్చా రని అన్నారు. రానున్న రోజుల్లో దళితబంధు, బీసీ బంధు లాగా అన్ని వర్గాల ప్రజలకు ప్రోత్సాహం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 612 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.6.12 కోట్ల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. బీసీ బంధు పథకంలో భాగంగా నియోజకవర్గంలో 40 మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పునమంజూరు పత్రాలు అందజేశారు. వేములవాడ అర్బన్‌ మండలం ఆరేపల్లికి చెందిన మేకల అశ్విని, వేములవాడ పట్టణానికి చెందిన వోరుగంటి రాజాకు సీఎం ఓవర్సీస్‌ స్కాలర్షిప్‌ పథకం కింద ఒక్కొక్కరికి రూ.20 లక్షల మంజూరు పత్రాలు అందజేశారు. పలువురికి మైనారిటీ రుణాల పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, రాష్ట్ర టెక్స్‌టైల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పద్మనాయక కల్యాణ మండపంలో సిరిసిల్ల నియోజకవర్గ స్థాయిలో సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌, గొర్రెల పంపిణీ, కుల వృత్తుల లబ్ధిదారులకు లక్ష రూపాయల రుణసాయం వంటి సంక్షేమ పథకాలను నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, ప్రజాప్రతినిధులతో కలిసి పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లా డుతూ జిల్లాలో కులమతాలకు అతీతంగా సబ్బండ వర్గాలందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోం దన్నారు. గొల్ల కుర్మలకు గొర్రెల యూనిట్లు, మత్స్యకా రులకు చేప పిల్లల పంపిణీ, మార్కెట్లు, వాహనాలు, రజకులకు అధునాతన దోబీఘాట్‌లు, ఉచిత కరెంట్‌, నాయీ బ్రాహ్మణులకు ఉచిత కరెంట్‌, శాలి వాహనులకు యంత్రాలు, పేదింటి ఆడపిల్లల కోసం కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ వంటి పథకాలతోపాటు రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి పథకాలను అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రైతుబంధు ద్వారా ఇప్పటి వరకు లక్షా 20 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.1202.85 కోట్లు జమ చేశామన్నారు. జిల్లాలో 1.20 లక్షల మందికి అసరా పింఛన్లు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 6886 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేశారన్నారు. నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో అడుగడుగునా సంక్షో భాన్ని ఎదుర్కొన్నామని, స్వరాష్ట్రంలో గడపగడపకు సంక్షేం అందుతోందని అన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వినోద్‌కుమార్‌, జిల్లా వెనకబడిన తరగతుల అధికారి రాఘవేందర్‌, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందంకళ, రైతు బంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, ఎంపీపీలు జనగామ శరత్‌రావు, పడిగెల మానస, పిల్లి రేణుక, మాలోతు బూల, వంగ కరుణ, జడ్పీటీసీలు లక్ష్మణ్‌రావు, గుండం నర్సయ్య, కొమిరిశెట్టి విజయ, గుగులోతు కళావతి, సెస్‌ డైరెక్టర్లు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-09T23:40:19+05:30 IST