ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగకు ఆదరణ
ABN , First Publish Date - 2023-10-05T00:12:51+05:30 IST
ఎమ్మెల్సీ కవిత కృషితో ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగకు ఆదరణ వచ్చిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో బతుకమ్మ పండగ సందర్భంగా మహిళలకు బతుక మ్మ చీరలను ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంతసురేష్ తో కలిసి పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం
జగిత్యాలరూరల్, అక్టోబరు 4: ఎమ్మెల్సీ కవిత కృషితో ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగకు ఆదరణ వచ్చిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో బతుకమ్మ పండగ సందర్భంగా మహిళలకు బతుక మ్మ చీరలను ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంతసురేష్ తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం విధ్యార్థులకు క్రీడాపరికరాలను పంపిణీ చేశారు. 20 కోట్ల రూపాయలతో నిర్మించిన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను 40 మంది లబ్ధిదారులకు అందజేశారు. 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న గ్రామపంచాయితీ భవనానికి భూమిపూజ, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల కోసం అనేక కార్యక్రమా లను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని పేర్కోన్నారు. పసుపు బోర్డు ఎన్నికల జిమ్మిక్కు అని ప్రజలు బీజేపీ పార్టీని నమ్మవద్దన్నారు. కార్యక్ర మంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ప్యాక్స్ చైర్మన్లు అన్నమనేని సందీప్‌రావు, పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, ఆర్‌బీఎస్ మండల కన్వీనర్ రవీందర్‌రెడ్డి, సర్పంచ్ జాన్, ఎంపీటీసీ సునీత పాల్గొన్నారు.
కోరుట్ల రూరల్: మహిళ సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపోందించి అదిస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అన్నారు. బుధవారం మండల ప్రజపరిషత్ కార్యాలయంలో మండలం లో ని వివిధ గ్రామాలకు చెందిన మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎంపీపీ తోట నారాయణ, జడ్‌పీటీసీ సభ్యురాలు దారిశెట్టి లావణ్య-రాజేష్‌లతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ, రైతు సమన్యయ కమిటి జిల్లా అధ్యక్షుడు చీటి స్వరూప-వెంకట్ రావు, నాయకులు సందయ్య, గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు.