బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త

ABN , First Publish Date - 2023-04-24T00:10:54+05:30 IST

బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త అని సిరిసిల్ల ఇన్‌చార్జి డీఆర్వో శ్రీనివాసరావు అన్నారు.

బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త
నివాళులర్పిస్తున్న ఇన్‌చార్జి డీఆర్వో శ్రీనివాసరావు

సిరిసిల్ల ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త అని సిరిసిల్ల ఇన్‌చార్జి డీఆర్వో శ్రీనివాసరావు అన్నారు. మనుషులందరూ ఒకటేనని స్త్రీ, పురుష బేధం లేదని, శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తి ఉన్న సత్పవర్తనే ముఖ్యమని, వీరశైవ సంప్రాదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడని కొనియాడారు. ఆది వారం కలెక్టరేట్‌లో మహాత్మా బసవేశ్వరుని జయంతిని ఘనంగా నిర్వహిం చారు. బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్వమానవ సమాన త్వాన్ని ప్రబోధించిన విశ్వగురువుగా అందరి హృదయాల్లో బసవేశ్వరుడు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. కుల, వర్ణ, వర్గ లింగ వివక్ష లేకుండా సమసమాజ నిర్మాణం కోసం బసవేశ్వరుడు కృషి చేశారన్నారు. మహిళా సాధికారిత కోసం పాటుపడి మహోన్నతుడన్నారు. జిల్లా బీసీ సంక్షేమా ధికారి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్తగా నిలిచిన మహోన్నతుడన్నారు. బసవేశ్వరుని ఆచరణలు నేటికి కొనసాగడం సంతోషకరమని, ఆయన చూపిన అడుగు జాడల్లోనే ప్రజలందరూ ప్రయాణించాలని అన్నారు. డీపీఆర్వో దశరథం, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, వీరశైవ లింగాయత్‌ లింగబలిజ సంఘం జిల్లా అధ్యక్షురాలు కాకరకాయల మంజుల, ఉపాధ్యక్షుడు శివప్రసాద్‌, కార్యవర్గ సభ్యులు ఎస్‌.చంద్రమౌళి, శీల గంగాధర్‌, మహిళా సంఘం అధ్యక్షురాలు శీల కరుణ, ఎస్‌.చంద్రకళ, ఉమ, అనూష తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వీరశైవ లింగాయత్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక రైతు చర్చా మండలిలో బసవేశ్వరుడి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. బసవేశ్వరుడి చిత్ర పటానికి ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ కుల, వర్ణ, లింగ వివక్ష లేని సమాజం కోసం బసవేశ్వరుడు ఆ కాలంలో కృషి చేశారని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. వీరశైవ లింగాయత్‌ సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తానని జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, నాయకులు బాల్‌రెడ్డి, సోమ్‌కుమార్‌, రాములు, మంజులప్రసాద్‌, శంకర్‌, భూమయ్య, శేఖర్‌, వీరేశం, సతీష్‌, శివకుమార్‌, అరుణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-24T00:10:54+05:30 IST